AnantRadhikaWedding : అనంత్ అంబానీ – రాధిక పెళ్లి వేడుకలో సౌత్ సూపర్ స్టార్స్..

AnantRadhikaWedding : అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌ ల వివాహ వేడుక జులై 12 రాత్రి అట్టహాసంగా ముంబై నగరంలో అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్‌ లో జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలో సౌత్ ఇండియా సూపర్ స్టార్లు, సెలెబ్రిటీలు, అలాగే బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరవడం జరిగింది. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్లే ఎక్కువగా ఉన్నా, అక్కడ మీడియాని ఎక్కువగా ఆక్ట్రాక్ట్ చేసింది సౌత్ హీరోలే కావడం విశేషం. ఇక ఈ వేడుకలో పలువురు స్టార్ హీరోలు తమ తమ ఫ్యామిలీస్ విచ్చేయడం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సౌత్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ సూర్య, మలయాళ స్టార్ పృత్విరాజ్ సుకుమారన్ సహా ఎంతో మంది స్టార్ హీరోలు వారి ఫ్యామిలీ తో సహాహాజరయ్యారు. ఒక్క సారి అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిన సౌత్ స్టార్లు వాళ్ళ ఫ్యామిలీలను చాలా మంది ప్రముఖులున్నారు.

South Indian Stars Ram Charan, Mahesh Babu, Rajinikanth at Anant Radhika Wedding Ceremony

స్పెషల్ అట్రాక్షన్ గా సౌత్ సూపర్ స్టార్స్…

అనంత్ రాధికా పెళ్లి వేడుకలో (AnantRadhikaWedding) సౌత్ నుండి హాజరైన సెలెబ్రిటి స్టార్ లలో రజినీకాంత్ – లతా రజినీకాంత్, రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల, సూర్య – జ్యోతిక, మహేష్ బాబు – నమ్రతా శిరోద్కర్ తో పాటు వారి కూతురు సితార తో హాజరయ్యారు. అలాగే నయనతార – విఘ్నేష్ శివన్‌, kgf యష్, అక్కినేని అఖిల్, విక్టరీ వెంకటేష్, అట్లీ, రానా దగ్గుపాటి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

South Indian Stars Ram Charan, Mahesh Babu, Rajinikanth at Anant Radhika Wedding Ceremony

కదిలొచ్చిన బాలీవుడ్ తారాగణం..

బాలీవుడ్ ప్రముఖులు, అమితాబ్ బచ్చన్ వారి ఫ్యామిలీ తో ఐశ్వర్య రాయ్ బచ్చన్ సహా, అలాగే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వారసులు సుహానా ఖాన్ – ఆర్యన్ ఖాన్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్, రితేష్ దేశ్ముఖ్ – జెనీలియా, జాన్వీ కపూర్, దిశా పటాని, కృతి సనన్, వరుణ్ ధావన్, రాశి ఖన్నా, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, టైగర్ ష్రాఫ్, సారా అలీ ఖాన్, రణబీర్ కపూర్ – అలియా భట్, విద్య బాలన్, హనీ సింగ్, అమిత్ త్రివేది, సంజయ్ దత్, అనన్య పాండే, జాక్వెలిన్ పెర్నాండజ్, ప్రియాంక చోప్రా, సోనాలి బింద్రే, హ్రితిక్ రోషన్ అనంత్ అంబానీ రాధికా పెళ్ళికి హాజరయ్యారు. అలాగే క్రీడా ప్రముఖులు ఎమ్మెస్ ధోని, హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్య, యఙవేంద్ర చాహల్, గౌతమ్ గంభీర్ వారి వారి ఫ్యామిలీ లతో హాజరయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు