South Movies : సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ కాబోతున్న సౌత్ సినిమాలు ఇవే

South Movies : ఈ ఏడాది ప్రథమార్థం దాదాపుగా చప్పగానే సాగిపోయింది. పాన్ ఇండియా సినిమాలన్నీ సెకండాఫ్ లోనే రిలీజ్ పెట్టుకోవడంతో మూవీ లవర్స్ కు ఫస్ట్ హాఫ్ లో ఎక్సెపెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ దొరకలేదు. కానీ సెకండాఫ్ స్టార్ట్ అయ్యింది. కల్కితో మొదలైన హడావిడి సరిపోదా శనివారం మూవీతో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇక ఇప్పుడు సెప్టెంబ‌ర్ రాక‌తో మరికొన్ని తాజా చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వాటిలో చాలా వరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్ అమీర్, జయరామ్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇందులో విజయ్ గాంధీ అనే ప్రత్యేక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు చెందిన మాజీ నాయకుడుగా కన్పించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. దీని కోసం మేకర్స్ డీ-ఏజింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు.

Whopping budget for Vijay's GOAT

- Advertisement -

ఉరుకు పటేల

ఉరుకు పటేలా అనేది తెలుగు మూవీ. వివేక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజుస్ కంచెర్ల, ఖుష్బూ చౌదరి, చమ్మక్ చంద్ర, జై చంద్ర, గోపరాజు రమణ, లావణ్య రెడ్డి, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదువుకోని ఒక అబ్బాయి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడతాడు. కానీ దానివల్లే అతనికి పెళ్లి సెట్ కాదు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ను ఈ వీక్ థియేటర్లలో డోంట్ మిస్.

35 – చిన్న కథ కాదు

నివేదా థామస్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న 35-చిన్న కథ కాదు చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. నంద కిషోర్ ఈమాని దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 6 న థియేటర్లలో రిలీజ్ కానుంది.

35-Chinna Katha Kaadu Trailer: Inspiring Tale

డాలర్స్‌పేట (కన్నడ)

సౌమ్య జగన్మూర్తి, పృథ్వీ అంబార్, వెంకట్ రాజ్, ఆకర్ష్ కమల, కుశాల్స్, కౌషిక్ గౌడ, మహేంద్ర ప్రసాద్, రఘు రమణకొప్ప ప్రధాన పాత్రల్లో నటించిన డాలర్స్ పేట మూవీకి మోహన్ ఎన్ మునినారాయణప్ప దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది. ఎ డే ఇన్ డాలర్స్‌పేట అనే మూవీ ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోకుండా రూ. 13 కోట్ల రూపాయలను 100 విభిన్న ఖాతాలకు బదిలీ చేయడం, ఆ తరువాత జరిగే పరిణామాల చుట్టూ సాగుతుంది.

ఇబ్బని తబ్బిడ ఇలియలి (కన్నడ)

విహాన్, అంకితా అమర్, మయూరి నటరాజా తదితరులు నటించిన ఇబ్బని తబ్బిడ ఇలియలి మూవీకి చంద్రజిత్ బెల్లియప్ప దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇబ్బని తబ్బిడ ఇలియాలి రక్షిత్ శెట్టి సహ నిర్మాతగా రానున్న కన్నడ యూత్ ఫుల్ మూవీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు