South Stars : రియల్ స్టార్స్… ఫ్యాన్స్ కోసం కోట్ల యాడ్ ఆఫర్లను వదులుకున్న సౌత్ హీరోలు వీళ్లే

South Stars : హీరోలుగా పాపులర్ అయ్యాక స్టార్ నటులకు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా డబ్బులు సంపాదించే అవకాశం దక్కుతుంది. కొన్ని బ్రాండ్స్ తమ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేసుకోవడానికి హీరోలకు ఉన్న ఇమేజ్ ను ఇలా క్యాష్ చేసుకుంటారు. స్టార్స్ కూడా ఒకవైపు సినిమాలు మరోవైపు ఇలా యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తారు. కానీ స్టార్స్ అందరిలోనూ సౌత్ స్టార్స్ వేరయా అన్పిస్తున్నారు మన హీరోలు. ఫామ్ లో ఉన్నాము కదా అని తన అభిమానులను తప్పుదోవ పట్టించే బ్రాండ్ ప్రమోషన్లకు మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు. మరి ఇప్పటిదాకా అభిమానుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్ల యాడ్ ఆఫర్లను వదులుకున్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.

అభిమానుల కోసం కోట్ల ఆఫర్ కు నో

పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే లాభదాయకమైన ఆఫర్‌ను ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ఇటీవల తిరస్కరించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. సమాచారం ప్రకారం అతను ప్రేక్షకుల పట్ల తన బాధ్యతను పేర్కొంటూ బ్రాండ్‌లో భాగం కావడానికి నిరాకరించాడు. ఓ గుర్తింపు పొందిన పాన్ మసాలా బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడానికి ఆర్ మాధవన్‌కు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారట. అయితే అతను ప్రేక్షకుల ఆరోగ్యానికి హాని కలిగించే సందేశం ఇవ్వలేనంటూ ఈ ఆఫర్‌ను తిరస్కరించాడు. మాధవన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో సదరు పాన్ మసాలా బ్రాండ్ కొత్త ముఖం కోసం వెతుకుతోంది. మాధవన్ కోట్ల విలువైన ఆ ఆఫర్‌ను అభిమానుల కోసం తిరస్కరించడంతో ఫ్యాన్స్ ఆయనను రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

KGF 2: Yash responds to Pushpa star Allu Arjun's positive review; showers  praise in return

- Advertisement -

ఇంతకుముందు పాన్-ఇండియా స్టార్ అల్లు అర్జున్ రాబోయే పుష్ప సీక్వెల్ కోసం కోట్ల విలువైన మద్యం, పొగాకు ప్రకటనల ఒప్పందాన్ని తిరస్కరించి హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పుష్ప: ది రూల్ సీక్వెల్‌లో పుష్ప రాజ్ వలె పొగతాగినప్పుడల్లా లేదా పొగాకు నమిలేటప్పుడల్లా స్క్రీన్‌పై తమ లోగోను ప్రదర్శించమంటూ ఓ పొగాకు బ్రాండ్ అల్లు అర్జున్ కు రూ. 10 కోట్ల ఆఫర్‌ను ఇవ్వగా, ఆయన తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఇది తన నైతికతకు విరుద్ధమని, అలాంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం తనకు సౌకర్యంగా లేదని అల్లు అర్జున్ తిరస్కరించాడు. KGF స్టార్ యష్ కూడా ఇలాంటి ఎండార్స్‌మెంట్ ఆఫర్‌ను తిరస్కరించారు.

యాడ్స్ వల్ల దారుణంగా ట్రోలింగ్

గతంలో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేష్ బాబు, అజయ్ దేవగన్ వంటి పలువురు ప్రముఖులు పాన్ మసాలా బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం చూశాం మనం. ఆ తర్వాత ఈ హీరోలు అందరిపై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో మహేష్ బాబు కూడా ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు వీరంతా అల్లు అర్జున్, యష్, మాధవన్ లాంటి హీరోలను చూసి నేర్చుకోవలంటూ కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు