SPB’s voice from heaven: హెవెన్ నుంచి ఎస్పీబీ వాయిస్ , కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్న అనిరుధ్

SPB’s voice from heaven: అనిరుధ్ రవిచంద్రన్ ఈ పేరు గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు భారతీయ ప్రేక్షకులకి అందరికీ తెలుసు. అతి చిన్న ఏజ్ లోనే కొలవరెడి అనే పాటతో ప్రభంజనం సృష్టించాడు అనిరుధ్. అక్కడితో ఆగకుండా అంచలంచెలుగా కెరియర్ లో ఎదిగాడు. అనిరుధ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఒక డ్రగ్ లా ఎక్కుతూ ఉంటాయి. అలానే అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూనే ఉంటుంది. రజినీకాంత్, కమలహాసన్, అజిత్, విజయ్, ధనుష్ వంటి తమిళ్ స్టార్ హీరోస్ తో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా మ్యూజిక్ అందించాడు.

ఇక రీసెంట్ టైమ్స్ లో అనిరుద్ మ్యూజిక్ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ఒక సాంగ్ వస్తుంది అంటేనే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. పిట్ట కొంచెం కూత గానం అని సామెత కరెక్ట్ గా అనిరుధ్ కి వర్కౌట్ అవుతుంది. ప్రతి పాట కోసం ఒక తపస్సులా పని చేసి ఆడియన్స్ మీదకి వదులుతాడు. రీసెంట్ గా స్టార్ హీరోలకు సంగీతం అందించడమే కాకుండా చాలామంది ప్రముఖ సింగర్లతో కూడా పనిచేసే పాటలు పాడించాడు అనిరుధ్ .

భారతీయ ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎస్పీబీ పాడిన ఎన్నో పాటలు తెలుగు సినిమా ఉన్నంత కాలం బ్రతికి ఉంటాయి. ఎస్పీబీ లేని లోటు ఆయన పాటలు ఎప్పుడూ తీరుస్తూనే ఉంటాయి. బాధ వచ్చిన ఆనందం వేసిన ఎస్పీబీ పాటలే ఓదార్పు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఎస్పీబీ పేరు మీద ఒక ప్రముఖ తమిళ్ ఛానల్ అనిరుధ్ కి అవార్డును అందించింది. ఎస్పీబీ గోల్డెన్ అవార్డును అందించడంతోపాటు దానిపై ఎస్పీబీ ఎలా స్పందిస్తారు అనే ఒక థాట్ ఆలోచించి హెవెన్ నుంచి ఎస్పీబీ మాట్లాడినట్లు ఒక వీడియోను క్రియేట్ చేశారు.

- Advertisement -

SPB's Voice from Heaven Anirudh's Happy Tears

ఎస్పీబీ మాట్లాడుతూ

ఆ వీడియోలో ఎస్పీబీ మాట్లాడుతూ అనిరుధ్ ను ప్రశంసిస్తూ షారుక్ ఖాన్ లాంటి హీరోతో జవాన్ సినిమాకి పనిచేసి హిట్టు అందుకున్నావు. నువ్వు కంపోజ్ చేసిన హుకుం పాటను విన్నాను. నువ్వు ఇంకా చాలా దూరం వెళ్లాలి. లవ్ యూ కన్నా అంటూ మాట్లాడారు. రజనీకాంత్ కెరియర్ లో హుకుం సాంగ్ ఎంత పవర్ఫుల్ కం బ్యాక్ అయిందో అందరికీ తెలిసిందే. జైలర్ సినిమా హిట్ అవ్వడానికి ఆ సినిమా పైన అంత బజ్ రావడానికి కారణం ఆ సాంగ్. రజనీకాంత్ చాలా ఎంట్రీ సాంగ్స్ ను ఎస్పీబీ పాడారు. కానీ జైలర్ సినిమా టైమ్ కి ఆయన లేరు. ఇక అనిరుధ్ చివరగా ఎస్పీబీతో పని చేసిన సినిమాలు పేట, దర్బార్. ప్రస్తుతం ఈ వీడియో అనిరుధ్ తో పాటు చూసిన వీక్షకులు కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. అతి త్వరలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు