Spirit: అన్ని మంచి శకునములే, కానీ సందీప్ రెడ్డి వంగ మూడు ఎలా ఉంటుందో

Spirit: తెలుగు సినీ పరిశ్రమలు సెంటిమెంట్స్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా కలిగే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకొని మరోసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించాడు. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ వసూలు చేసింది.నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగి. ఆ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ కి ఒక అద్భుతమైన దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత తన 3వ సినిమా అని ప్రభాస్ తో చేశాడు. ఇక కల్కి సినిమా విషయం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉగ్రం సినిమాతో దర్శకుడుగా

ఉగ్రం సినిమాతో దర్శకుడుగా కన్నడ ఫిల్మి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అయితే ఆ సినిమా పెద్దగా ఎవరికి తెలియదు. కే జి ఎఫ్ సినిమాతో మంచి సూపర్ హిట్ అందుకుని ఆ సినిమాతో దర్శకుడుగా కూడా మంచి పేరును సాధించుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా కె.జి.ఎఫ్ 2 సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈసారి ప్రభాస్ తో అవకాశాన్ని చేజిక్కించుకొని ఉగ్రం కథని మళ్లీ సలార్ గా చేశాడు ప్రశాంత్ నిల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది.

- Advertisement -

Spirit

ఇక అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ అనే పేరుతో కూడా రీమిక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇకపోతే ఆ సినిమాపై కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా అనిమల్ సినిమాతో మరోసారి సమాధానం చెప్పాడు సందీప్. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో సినిమాను చేస్తున్నాడు. ఇది సందీప్ చేస్తున్న మూడువ సినిమా. అయితే ఇప్పటివరకు దర్శకులు తమ 3వ సినిమాను ప్రభాస్ తో చేసిన వాళ్లంతా కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇలా చూస్తే అన్నీ మంచి శకునములే కానీ ప్రభాస్ తో సందీప్ ఎంతటి హిట్ సినిమా అందుకుంటాడో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు