Spirit: సందీప్ రెడ్డి వంగ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే

Spirit: సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశాడు. సినిమాని ఇలా కూడా తీయొచ్చు అంటూ సినిమాకి ఒక కొత్త ఫార్ములాను చూపించాడు సందీప్ రెడ్డివంగా. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలు ఇంపాక్ట్ అనేది కొన్ని ఏళ్ల పాటు అలాగే ఉండిపోతుందని చెప్పొచ్చు. రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకుడిగా పరిచయమైన శివ(Shiva) సినిమా అలాంటిదే. శివ సినిమా వచ్చిన తర్వాత చాలామంది విజయవాడలో సైకిల్ చైన్ పట్టుకుని తిరిగేవారు అంటూ చెబుతూ ఉంటారు. అంటే ఆ సినిమా చూపించిన ఇంపాక్ట్ అలాంటిది.

ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా కూడా శివ తో కంపేర్ చేసేంత హిట్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సంచలమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు సందీప్ రెడ్డి. ఇదే సినిమాని బాలీవుడ్ లో సాహిద్ కపూర్ తో కబీర్ సింగ్(Kabir Singh) గా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకి బాలీవుడ్ లో చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. రేటింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. కానీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి 250 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఈ సినిమా పై కొందరు కావాలని విష ప్రచారం చేశారంటూ రియలైజ్ అయ్యాడు సందీప్ రెడ్డి. ఈ సినిమాను ఒక వైలెంట్ ఫిలిం గా చెప్పుకొచ్చారంటూ చాలా ఫీల్ అయ్యాడు.

అసలైన వైలెంట్ ఫిలిం

అయితే బాలీవుడ్ పీపుల్ కి అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో చూపిస్తాను అంటూ రణ్బీర్ కపూర్(Ranbeer Kapoor) హీరోగా అనిమల్ సినిమాను తెరకెక్కించాడు. అనిమల్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. సినిమా మొదటి షో పడినప్పుడు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో అద్భుతంగా దూసుకెళ్లింది. మూడు గంటల పైగా నిడివి ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఎక్కదని కొంతమంది భావించారు. అయితే సందీప్ మాత్రం డ్యూరేషన్ అనేది పెద్ద మేటర్ కాదని సినిమాను రిలీజ్ చేశాడు. సందీప్ నమ్మకమే నిజమైంది. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ రీసెంట్ టైమ్స్ లో మంచి హాట్ టాపిక్ అయ్యాడు.

- Advertisement -

Sandeep Reddy

సందీప్ రెడ్డివంగా ఫ్యూచర్ ప్లాన్స్

రీసెంట్గా సందీప్ రెడ్డివంగా(Sandeep Reddy Vanga) ఒక కాలేజీలో ఈవెంట్ కి హాజరయ్యాడు అక్కడ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో రివీల్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఈ సినిమా దాదాపు ఒక రెండేళ్లపాటు జరగనుంది. ఆ తర్వాత అనిమల్ సినిమాకి సీక్వెల్ గా అనిమల్ పార్క్ రానున్నట్లు తెలిపాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ రెండు సినిమాల పైన పనిచేయనున్నాడు సందీప్ రెడ్డి వంగ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు