Spirit: ఒరేయ్ ఆ డాన్ లీ ఇంస్టాగ్రామ్ మొత్తం మన రెబల్సే ఉన్నారు కదా రా

Spirit: అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మళ్ళీ అంతటి ఇంపాక్ట్ చూపించిన సినిమా అర్జున్ రెడ్డి. అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా మంచి హిట్టును సాధించాడు. ఒకసారిగా బాలీవుడ్ లో కూడా సందీప్ రెడ్డి వంగా పేరు మారు మోగిపోయింది. అయితే చాలామంది బాలీవుడ్ సినిమా ప్రముఖులు సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరికీ కూడా అనిమల్ సినిమాతో తిరిగి సమాధానం చెప్పాడు సందీప్.

అనిమల్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రన్బీర్ కపూర్ లోని కంప్లీట్ యాక్టర్ ను బయటకు తీసి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో గీతాంజలి అనే పాత్రలో కనిపించింది రష్మిక. ఇప్పటివరకు రష్మిక చేసిన అన్ని సినిమాల్లో కంటే కూడా ఈ సినిమాలో ది బెస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత రష్మిక కి వరుస అవకాశాలు వచ్చాయి.

 Don Lee

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ నుంచి ఏ సినిమా వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ గురించి ఎప్పుడో అప్డేట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమా డిసెంబర్లో స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాలు కొరియన్ యాక్టర్ డాన్లీ ఒక పాత్రలో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అక్కడితో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా డాన్లీ ఇంస్టాగ్రామ్ పేజీలో కనిపిస్తున్నారు. ఏ ఫోటో చూసినా దాని కింద ప్రభాస్ స్పిరిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు