Sr. NTR: ఎన్టీఆర్ పిల్లల పేర్ల వెనుక ఇంత కథ ఉందా..?

Sr. NTR.. నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 12 మంది సంతానం.. కాగా అందులో 8 మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.. వీరికి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా పేర్లు పెట్టారు.. అయితే అలా వీరందరికీ పేర్లు పెట్టడం వెనుక ఒక పెద్ద వ్యవహారమే నడిచిందని అప్పట్లో ఒకసారి మీడియాతో ఆయన వెల్లడించినట్లు సమాచారం.. ఇదిలా ఉండగా ఈరోజు దివంగత సినీ నటులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి.. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అందులో భాగంగానే ఆయన వారసుల పేర్ల వెనుక అసలు కారణం ఏమిటి అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది..

ఎన్టీఆర్ వారసులు 12 మంది..

Sr. NTR: Is there a story behind the names of NTR's children?
Sr. NTR: Is there a story behind the names of NTR’s children?

వెండితెరపై తిరుగులేని రారాజుగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ తెలుగు సినిమా కీర్తిని ఇనుమడింప చేశారు.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేసి.. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. ఎన్టీఆర్ సమాజంతో పాటు కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమించారు. అలా ఎన్టీఆర్ కి 12 మంది పిల్లలు కాగా వారికి మంచి చదువులు చెప్పించారు.. కళలు కూడా నేర్పించారు.. ఇక సినిమా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ, హరికృష్ణ నటులుగా రాణించారు కూడా.. చిత్ర పరిశ్రమలో నిర్మాతలుగా ఒకరిద్దరు సత్తా చాటారు. మరొకవైపు ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి దేశ రాజకీయాలలో తనదైన ముద్రవేసింది.

వారసులకు పేర్లు పెట్టడం వెనుక ఉద్దేశం అదే..

ఇకపోతే తాజాగా ఈయన పిల్లల పేర్ల వెనుక అసలు విషయం ఏమిటంటే.. అబ్బాయిల పేర్ల చివర కృష్ణ వచ్చే విధంగా అమ్మాయిల పేర్ల చివర ఈశ్వరి అని వచ్చేలా ఎన్టీఆర్ పేర్లు నిర్ణయించారు.. ఇక ఈయన కొడుకుల పేర్లను గమనిస్తే.. సీనియర్ రామకృష్ణ , సీనియర్ జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహన కృష్ణ, జూనియర్ రామకృష్ణ , జూనియర్ జయకృష్ణ, బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారులు.. వీరందరి పేర్ల చివర కృష్ణ అని ఉండడం మనం గమనించవచ్చు.. ఇక అమ్మాయిల పేర్లు పరిశీలిస్తే పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, ఉమామహేశ్వరి గా ఎన్టీఆర్ నిర్ణయించారు.. ఈ అమ్మాయి ల పేరు చివర కూడా ఈశ్వరి వచ్చేలా ఆయన పేర్లు నిర్ణయించడం జరిగింది .కాకపోతే ఈ పేర్లు పెట్టడం వెనుక ఒక ప్రాస ఫాలో అయ్యారు ఎన్టీఆర్..

- Advertisement -

తాత లాగే మనవడు కూడా..

అసలు కథ ఏమిటంటే.. ఎన్టీఆర్ కి దైవభక్తి ఎక్కువ.. అందుకే భగవంతుడు కృష్ణ పేరు కొడుకులకు పెట్టారు.. అలాగే శివుడు అంటే కూడా భక్తి ఎక్కువ.. అందుకే మరొక పేరు ఈశ్వరుడు లోని ఈశ్వరి అని అమ్మాయిల పేర్లలో చివరిగా వచ్చేలా చూసుకున్నారు.. అలాగే భాషాభిమానం కలిగిన ఆయన తన పిల్లల పేర్లలో తెలుగుదనం ఉట్టిపడేలా నిర్ణయించారు.. ఇక దైవభక్తి, భాషాభిమానం రెండూ కలిగి ఉన్న ఈయన తన పిల్లల పేర్లను ఇలా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది.. ఇక మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత లాగే తన పిల్లలకు చివర్లో రామ్ అనే పదం వచ్చేలా పెట్టారు.. అభయ్ రామ్ , భార్గవ్ రామ్ అని చివర్లో రామ్ అనే పదం వచ్చేలాగా జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకులకు పేర్లు పెట్టడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు