Sree leela: మళ్లీ అదే తప్పు చేస్తున్న శ్రీ లీల..?

Sree leela: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రీ లీల ఒకరు. వాస్తవానికి హీరోయిన్ శ్రీ లీల… అమెరికాలోనే పెరిగింది. అక్కడి లైఫ్ కు అలవాటు పడి… టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. మొట్టమొదటగా కన్నడ చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల… ఆ తర్వాత తెలుగు కు పరిచయమైంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ కొడుకుతో సినిమా చేసింది హీరోయిన్ శ్రీ లీల. తొలిసారిగా హీరోయిన్గా శ్రీ లీల చేసిన ఈ సినిమానే పెళ్లి సందడి. ఈ సినిమా చాలా కలర్ ఫుల్ గా ఉన్నప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. కానీ యంగ్ హీరోయిన్ శ్రీలీలకు మాత్రం మంచి అవకాశాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా ధమాకా సినిమా లో ఛాన్స్ కొట్టేసి దుమ్ము లేపింది హీరోయిన్ శ్రీ లీల.

Sreeleela: Everything is ready for Bollywood.. If you know who the hero is, fuse out..!

- Advertisement -

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది. కానీ ఒక సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు. స్కంద, భగవంతు కేసరి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఇలా ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు… మరోసారి నితిన్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది హీరోయిన్ శ్రీ లీల.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మొదట రష్మిక మందానను అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు రష్మికను కాదని… శ్రీ లీల చెంతలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే స్కంద అలాగే ఎక్స్ ట్రా ఆడినరీ మ్యాన్ సినిమాలలో లాగే… మోడరన్ లుక్స్ లో ఈ సినిమాలో కూడా కనిపించింది. గ్లి0ప్స్ లో ఈ విషయం స్పష్టమైంది.

 

అయితే అలా మోడరన్ లుక్స్ లో వచ్చిన సినిమా పెద్దగా హిట్ కాలేదు. ధమాకా సినిమాలో కాస్త మాస్ రోల్ చేసింది ఈ బ్యూటీ. అలాంటి రోల్ ఇందులో చేసి ఉంటే…ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యేది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతే ఏమి… శ్రీ లీల హిట్ కొట్టాలని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు