Sree Leela: అలా ప్రవర్తిస్తున్న శ్రీ లీల.. అభిమానులకు నిరాశ తప్పదా..?

Sree Leela.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల కన్నడ సినీ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేసి , ఆ క్రేజ్ తో టాలీవుడ్లోకి పెళ్లి సందD సినిమాతో అడుగుపెట్టింది. అయితే రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ ను మార్చేసుకుంది ఈ ముద్దుగుమ్మ . ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం అని పలువురు విమర్శకులు కూడా ప్రశంసించారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా కంటే ముందే ఆరు సినిమాలను లైన్లో పెట్టింది. ఈ సినిమా తర్వాత మరో నాలుగు సినిమాలకు సంతకం చేసింది అలా మొత్తం ఒకే ఏడాది పది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె.. సినిమా షూటింగ్ లకు సరైన డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని వదులుకుంది కూడా.. అయితే కొన్నింటిలో కష్టపడి నటించింది.. కానీ అవి కూడా విజయాన్ని అందించలేదు. దీంతో ఈమె కాస్త డీలా పడిపోయింది.

Sree Leela: Sree Leela who is behaving like that.. must be disappointed for the fans..?
Sree Leela: Sree Leela who is behaving like that.. must be disappointed for the fans..?

హీరోలకి కూడా నో చెబుతున్న శ్రీ లీల..

ముఖ్యంగా ఈమె నటించిన ఆదికేశవ, స్కంద , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా చాలా చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. అంతేకాదు కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది.. మరికొన్ని సినిమాల నుంచి తీసేసారు కూడా. ఇలా మొత్తానికైతే ఈమె సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉందని చెప్పవచ్చు. నిజానికి గుంటూరు కారం సినిమాలో నటించింది. కానీ పెద్దగా ఈమెకు వర్కౌట్ కాలేదు. అలాగే భగవంత్ కేసరి సినిమాలో నటించింది కానీ ఈమె కంటూ ఒక గుర్తింపు లభించలేదు. పైగా పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఇప్పుడే పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు

ఇకపై అలాంటి పాత్రలలోనే చేస్తాను..

ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఈమెకు డాన్స్ విషయంలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి పలు సినిమాలలో ఐటమ్ సాంగ్ ల కోసం అడుగుతున్నారట దీంతో ఇలా చేస్తే తన కెరియర్ పోతుందని, స్టార్ హీరోల సినిమాలకి కూడా నో చెబుతుందట శ్రీ లీల. అంతేకాదు ఇటీవల హీరో కార్తీ సరసన సర్దార్ 2 లో నటించే అవకాశం వచ్చిందని అయితే అందుకు కూడా నో చెప్పిందని తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో ఇద్దరు హీరోయిన్లు.. అందుకే లీడింగ్ హీరోయిన్ గా నటించాలని అనుకోవట్లేదు అని సోలో హీరోయిన్గా మాత్రమే నటిస్తానని, పైగా ఐటమ్ సాంగ్లు , క్యారెక్టర్ లేని పాత్రలు వస్తే ఒప్పుకోవద్దని మేనేజర్ కు చెప్పేసిందట .ఇక ప్రస్తుతం మరొకవైపు ఎంబిబిఎస్ కోర్స్ పూర్తి చేసే పనిలో పడింది. కాబట్టి సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ ఒక వైపు సినిమాలలో సక్సెస్ అవుతూ మరొకవైపు వైద్య వృత్తిని పూర్తిచేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమాలు లేవని తెలిసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు