Sreeja: మొదటి భర్తతో అంత నరకం చూసిందా.. అందుకే విడాకులా..?

Sreeja.. ఇండస్ట్రీలో మెగాస్టార్ తిరుగులేని హీరోగా పేరు సంపాదించారు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాలను అందుకుంటున్నారు.. ఈయన వారసుడిగా.. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇలా చాలామంది మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. కానీ చిరంజీవి పర్సనల్ లైఫ్ విషయాల్లో కి వెళ్తే మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మెగా డాటర్ శ్రీజ గురించి తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. వాటి గురించి చూద్దాం.

శ్రీజ మొదటి భర్త మరణం..

Sreeja: Did she go through so much hell with her first husband..that's why the divorce..?
Sreeja: Did she go through so much hell with her first husband..that’s why the divorce..?

మెగా డాటర్ శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ గడిచిన రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.. అయితే ఆయన మరణంతో వీరికి సంబంధించి ఎన్నో విషయాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్లి జరిగిన సమయంలో కూడా ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అప్పట్లో వైరల్ అయిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా శ్రీజ, శిరీష్ ఇద్దరూ కూడా ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయారట.

మొదటి భర్త కారణంగా నరకం చూసిన శ్రీజ..

చిరంజీవి కూతురు శ్రీజ మొదట తన కుటుంబం నుంచి తనకు రక్షణ కావాలి అంటూ మీడియా ముందు చెప్పడంతో మెగా ఫ్యామిలీ పరువు అంతా తీసేసిందని అభిమానులు మాట్లాడారు. కానీ తీరా శ్రీజ, శిరీష్ కు ఒక కూతురు పుట్టాక శిరీష్ యొక్క అసలు బుద్ధి బయటపడినట్లు సమాచారం.. ముఖ్యంగా డబ్బు కోసం వేధించేవాడనే.. అతని నిజా స్వరూపాన్ని శ్రీజ తెలుసుకుందట.. అంతేకాకుండా తనకు అప్పట్లోనే 50 లక్షల రూపాయలు కట్నం తేవాలని శారీరకంగా కూడా ఎక్కువగా హింసించే వాడట శిరీష్..

- Advertisement -

డబ్బు కోసమే ట్రాప్..

అలాంటి టార్చర్లు భరించలేక శ్రీజ ఇంటికి వచ్చేసి శిరీస్ భరద్వాజ్ పైన ఒక కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న శిరీష్.. ఈ విషయం నుంచి బయటపడడానికి ముందస్తు బెయిల్ కి కూడా అప్లై చేయగా.. కోర్టు అందుకు అంగీకరించలేదు.. దీంతో శిరీష్ కోర్టుకు లొంగిపోవలసి వచ్చింది.. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీజా కు శిరీష్ కి మధ్య విడాకుల కోసం మళ్లీ గొడవ రావడంతో సైలెంట్ గా ఇద్దరికీ విడాకులు ఇప్పించింది మెగా కుటుంబం.. అలా శ్రీజా ని కేవలం డబ్బు కోసమే శిరీష్ వివాహం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అప్పట్లో ఈ విషయాలు మాత్రం ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా చిరంజీవి వంటి స్టార్డం కలిగి ఉన్న నటుడు కూతురు కాబట్టి.. ఇలాంటి విషయాలు బయటికి రావడం చాలా అరుదు అని చెప్పవచ్చు. మొత్తానికి శ్రీజా ని ట్రాప్ లో పడేసి శిరీష్ వివాహం చేసుకున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు