Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప ఎవరో గుర్తు పట్టారా? ఈమంటే అబ్బాయిలకు పిచ్చి..

Guess The Actress : ఈ మధ్య కాలంలో సినీ హీరోయిన్ల, హీరోల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వాటికి సంబందించిన కొన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ నటుల ఫోటోలు ఏ రేంజులో ట్రెండ్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియా షికారు చేస్తుంది.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కాదు.. ఆమె ఎవరో కాదు ఇప్పుడు కుర్రాళ్లకు కలల రాకుమారి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది..

అంతేకాదు ప్రముఖ డైరెక్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటికైన ఎవరో గుర్తుపట్టారా ? అవును మీరు ఊహించిందే నిజం.. ఆ బ్యూటీ మరెవ్వరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఇండస్ట్రీలోకి లాంచ్ అయ్యింది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా ఆమె నటనకు టాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది..

sreeleela chaildhood photos viral in social media
sreeleela chaildhood photos viral in social media

శ్రీలీల నటించిన సినిమాల్లో రెండు , మూడు సినిమాలు మాత్రమే మంచి టాక్ ను అందుకున్నాయి. ఈ ఏడాది మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. బాలయ్యతో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకుంది.. భగవంత్ కేసరి సినిమాలో నటించింది.. సినిమా హిట్ అయ్యింది కానీ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది.. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ రవితేజతో జోడి కట్టబోతుంది. తెలుగు , తమిళ్ సినిమాలతో పాటుగా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ సినిమాల పై అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు