Sreeleela: బాలీవుడ్ కి సర్వం సిద్ధం.. హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజ్ అవుట్..!

Sreeleela: ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు విలన్ గా దూసుకుపోతున్న శ్రీకాంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రస్తుతం ఈయన వారసుడు కూడా ఇండస్ట్రీలో హీరోగా చలామణి అవుతున్నారు.. నిర్మల కాన్వెంట్ సినిమా ద్వారా పరిచయమైన శ్రీకాంత్ కొడుకు రోషన్.. హీరోగా చేసిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీ లీల.. ఆ తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా గత ఏడాది ఏకంగా తొమ్మిది సినిమాలకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ యంగ్ బ్యూటీ. అయితే ఈ తొమ్మిది సినిమాలలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా తప్ప మరే సినిమా కూడా ఈమెకు నటిగా పేరు తీసుకురాలేదు.. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ తీసిన ఆదికేశవ చిత్రం శ్రీ లీల కెరియర్ పైన భారీ ప్రభావాన్ని చూపింది.. ఇక ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా ఈమె నటించింది. అయితే ఈ సినిమా కూడా విజయవంతం అయ్యింది కానీ మునుపటిలాగా ఈమెకు అవకాశాలు లభించడం లేదు..

తెలుగులో ఒకే ఒక సినిమా..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాడు భగత్ సింగ్ చిత్రంలో మాత్రమే ఈమె నటిస్తోంది.. ఇదిలా ఉండగా మరో వైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలక హోదా అయిన డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ కి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది.. మరోవైపు అవకాశాలు రాక కాదు కానీ కేవలం ముందులాగా తొందరపడకుండా ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ..

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న శ్రీలీల..

Sreeleela: Everything is ready for Bollywood.. If you know who the hero is, fuse out..!
Sreeleela: Everything is ready for Bollywood.. If you know who the hero is, fuse out..!

అందులో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలుగులో సీనియర్ హీరో సినిమాతో విలన్ గా పరిచయం కాబోతున్న సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీకి ఈమెను హీరోయిన్గా ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఈ చిత్రానికి జన్నత్ సినిమా దర్శకుడు కునాల్ దేశముఖ్ దర్శకత్వం వహించనున్నారని.. ఈ సంవత్సరం ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది అని సమాచారం.. అంతే కాదు మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి..

- Advertisement -

ఇబ్రహీం ఎవరంటే..?

ఇకపోతే ఇబ్రహీం.. సైఫ్ అలీఖాన్ యొక్క మొదటి భార్య కొడుకు.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నారు.

బాలీవుడ్ లో సక్సెస్ అయ్యేనా..?

ఇదిలా ఉండగా తెలుగులో స్టార్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది .. మరి తెలుగులో లాగే బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. మొత్తానికి అయితే శ్రీ లీల బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బయలుదేరింది.. మరి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు