Sreeleela: ఆశలు పెట్టుకున్న శ్రీలీల.. వర్కౌట్ కాకపోతే ఇక బై బై..!

Sreeleela.. ప్రముఖ కన్నడ యంగ్ బ్యూటీ శ్రీ లీల స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత రవితేజ తో కలిసి ఖిలాడి సినిమాలో నటించి.. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది .. ఈ సినిమా తర్వాత వరుసగా ఈ భామకు అవకాశాలు తలుపు తట్టాయి. అందులో భాగంగా ఏకంగా తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఒకే ఏడాది అత్యధిక సినిమాలకు సైన్ చేసిన హీరోయిన్గా రికార్డు సృష్టించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి.. గుంటూరు కారం, భగవంత్ కేసరి సినిమాలు మినహా ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.

Sreeleela: Hopeful Sreeleela.. If she doesn't work out, bye bye..!
Sreeleela: Hopeful Sreeleela.. If she doesn’t work out, bye bye..!

ఆ రెండు సినిమాలపైనే ఆశలన్నీ..

ఇకపోతే ఇప్పుడు రెండు సినిమాలపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలు రెండు గనుక ఫ్లాప్ అయితే ఇక ఈమె ఇండస్ట్రీకి బై బై చెప్పాల్సిందే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఈ సినిమా మంచి విజయం సాధించకపోయినా ఇందులో శ్రీ లీల డాన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె చేతిలో రెండు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి.. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు రవితేజ చేస్తున్న మరో సినిమాలో ఈమె అవకాశాన్ని దక్కించుకుంది .. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనే ఈ అమ్మడు ఆశలు పెంచుకుంది.

శ్రీ లీల సినిమా భవిష్యత్తు ఆ సినిమాల చేతుల్లోనే..

ఈ సినిమాలు సక్సెస్ అయితే ఈమె కెరీర్ కు ఢోకా ఉండదు. ఒకవేళ దురదృష్టవశాత్తు రెండు సినిమాలు డిజాస్టర్ అయితే మాత్రం ఇక ఈమె కెరియర్ కంచికి చేరినట్టే అని చెప్పాలి.. మొత్తానికైతే ఈ రెండు సినిమాలు శ్రీ లీల సినిమా భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి అనడంలో సందేహం లేదు.

- Advertisement -

శ్రీ లీల కెరియర్..

శ్రీ లీలా విషయానికి వస్తే 2001 జూలై 14న అమెరికాలో జన్మించింది ..వీళ్లది తెలుగు ఫ్యామిలీ కావడం గమనార్హం .తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్.. విదేశాలలోనే పుట్టిన శ్రీ లీల .. బెంగళూరులో తన చదువును పూర్తి చేసుకుంది.. ఇక తెలుగులోకి రాకముందే కిస్, భారతే వంటి కన్నడ సినిమాలలో కూడా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక రవితేజ కిలాడి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ట్ సెలబ్రిటీ అయిపోయింది.. ఇకపోతే శ్రీ లీల డాక్టర్ చదువుతున్న విషయం తెలిసిందే.. నాలుగవ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.. శ్రీ లీల తన ఎంబిబిఎస్ కోర్స్ ను పూర్తి చేసి వైద్యురాలిగా స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఒకవేళ సినిమాలలో అవకాశాలు రాకపోతే ఇక తన వైద్యవృత్తిని చేపట్టి అందులో సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేయబోతుందని సమాచారం.. మరి శ్రీ లీల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు