SreeLeela: బీచ్ లో రెచ్చిపోయిన శ్రీ లీల..అతనితోనే వచ్చిందా ?

SreeLeela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘పెళ్లి సందD’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం కాలేదు. ఇక ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది.

రవితేజ నటించిన “ధమాకా” సినిమాతో సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమా అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ ఈ బ్యూటీ కథ ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించకపోవడంతో తాను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. వరుస పరాజయాలతో ఈ బ్యూటీ సినిమా అవకాశాలను కోల్పోయింది. ప్రస్తుతం శ్రీలీల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.

Sreeleela Shares A Glimpse Of Her Beach Holiday- Republic World

- Advertisement -

కొన్ని రోజులపాటు బ్రేక్ తీసుకున్న అనంతరం శ్రీలీల మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మంచి కథ, తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఉంటేనే సినిమాలకు ఓకే చెప్తానని చెబుతోందట. ఇక రీసెంట్ గా శ్రీలీల నటించిన చిత్రం “గుంటూరు కారం” ఈ సినిమాలో ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకోని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

కానీ ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్ మూడ్ ను ఎంజాయ్ చేస్తోంది. బీచ్ ఒడ్డున రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన శ్రీలీల అభిమానులు వెకేషన్ లో తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందని….అతనే శ్రీలీల ఫోటోలు తీసినట్టుగా అనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు