Sreeleela: ప్రారంభం ప్లాప్ ప్రయాణం టాప్

శ్రీ లీల తెలుగు సినీ పరిశ్రమలో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీ కి ఇచ్చి ముద్దు గుమ్మ. సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా ఈ అమ్మడికి మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. కేవలం యంగ్ హీరోస్ తో కాకుండా స్టార్ హీరోల సరసన కూడా ఈ భామ కు అవకాశాలు మెండుగా వస్తున్నాయి.

రీసెంట్ గా ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకుంది శ్రీలీల. బాక్స్ ఆఫీస్ కి వద్ద ధమాకా సినిమా కలక్షన్స్ వర్షం కురిపించడానికి ధమాకా లోని శ్రీలీల ఎనర్జీ కూడా పెద్ద ప్లస్ అయింది అని చెప్పొచ్చు.
తన పెరఫార్మన్స్ తో పాటు ఎనర్జిటిక్ స్టెప్పులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది ఈ భామ.

ప్రస్తుతం ఈ భామ చేతి నిండుగా, మెండైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న SSMB28 మూవీతో పాటు, నితిన్ తో వక్కంతం వంశీ మూవీ, బాలయ్య 108 మూవీ, రామ్ తో బోయపాటి తీస్తున్న మూవీ, నవీన్ పొలిశెట్టి తో అనగనగా ఒక రాజు, పంజా వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా ఇలా వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

- Advertisement -

కేవలం ఇవి మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఈ భామ పవన్ సరసన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా మొదటి సినిమా అనుకున్న విజయాన్ని ఇవ్వకున్నా ఇలా వరుస అవకాశాలు రావడం అనేది అరుదైన విషయం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు