Sreeleela – Thaman : గుడిలో హీరోయిన్ తో అలాంటి పని… ఆ చిలిపి పనులేంటి తమన్?

Sreeleela – Thaman : గుడి అంటే ఎంతో భక్తితో దైవ దర్శనానికి వస్తారు జనాలు. ముఖ్యంగా తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సెంటిమెంట్ గా భావిస్తారు. కానీ అలాంటి ప్లేస్ లో హీరోయిన్ శ్రీలీలతో ఓ చిలిపి పని చేసి దొరికిపోయాడు తమన్. మరి శ్రీలీల, తమన్ చేసిన ఆ చిలిపి పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీవారి సేవలో శ్రీలీల

యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ బ్యూటీ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో పాల్గొంది. అందరు సెలబ్రిటీలలాగే దర్శనం తర్వాత శ్రీలలకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం అందించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందుకున్న శ్రీలీల ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. ఏదైనా ప్రారంభించేటప్పుడు శ్రీవారిని దర్శించుకోవడం తనకు అలవాటని చెప్పిన శ్రీలీల దర్శనం బాగా జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ బ్యూటీ ఏం స్టార్ట్ చేయబోతోంది అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

శ్రీలీల బుగ్గ గిల్లిన తమన్..

ఇక పూజా కార్యక్రమాలు ముగించుకొని బయటకు వస్తున్న శ్రీలీలకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గుడి లోపలికి వెళ్తూ కనిపించారు. దీంతో ఇద్దరూ ఆగి కాసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత తమన్ శ్రీలీల బుగ్గ గిల్లి, షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుడిలో ఆ చిలిపి పనులు ఏంటి తమన్ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

Thaman – Sree Leela: తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గ గిల్లిన తమన్ - NTV Telugu

కొత్తగా స్టార్ట్ చేస్తోంది ఆ పనేనా?

కాగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. గుంటూరు కారం తరువాత టాలీవుడ్ లో పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో శ్రీలీల ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ చేసింది. త్వరలోనే ఈ బ్యూటీ నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించునుంది. మరోవైపు శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ రొమాంటిక్ హీరో వరుణ్ ధావన్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ తాజాగా ఆమె శ్రీవారిని దర్శించుకోవడం, సంతోషంగా కనిపించడం చూస్తుంటే ఈ వార్త నిజమేనని అనిపిస్తోంది. బాలీవుడ్ ఎంట్రీ నేపథ్యంలోనే శ్రీలీల శ్రీవారిని దర్శించుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఏదైనా కొత్తగా అంటూ దర్శనం తర్వాత ఆమె చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ, హిందీ చిత్ర పరిశ్రమలో కొత్తగా కాలు పెట్టబోతోంది కాబట్టి ఇలా హింట్ ఇచ్చిందని అంటున్నారు. ఏదేమైనా గుడిలో శ్రీలీల, తమన్ చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. మరి నెటిజన్లు దీన్ని ఇక్కడే వదిలేస్తారా? లేదంటే ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటాయా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు