Sreeleela : సోకులాడి స్వప్న సుందరి ఎందుకు ఇంత లేట్ చేసింది

Sreeleela : సినిమాకి స్పోర్ట్స్ కి ఒక విడుదలైన అనుబంధం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్న ఐపీఎల్ క్రికెటర్స్ అందరిని ప్రముఖ సినిమా వాళ్ళు కొనుగోలు చేశారు కాబట్టి. ఆర్సిబి కప్పు రాకపోయినా కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ సి బి ని ఆదరించే అభిమానించే ఫ్యాన్స్ లో శ్రీ లీలా ఒకరు.
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. కానీ శ్రీలీలా కి మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి. ఏకంగా స్టార్ హీరోస్ తో ప్రస్తుతం సినిమాలు చేస్తుంది శ్రీ లీలా.

మహేష్ బాబు సరసన కూడా

శ్రీ లీలా చేతులు ప్రస్తుతం చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. కేవలం సితార ఎంటర్టైన్మెంట్స్ లోని ఎన్నో సినిమాలకు సైన్ చేసింది లీలా. అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం అనే సినిమాలో మహేష్ బాబు సరసన కనిపించింది. ఈ సినిమాతో శ్రీ లీలా కు మంచి గుర్తింపు వచ్చింది. ఈమెలో ఉన్న డాన్స్ టాలెంట్ అంతా కూడా ఈ సినిమాతో బయటపడింది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా నటిస్తుంది.

Sreeleela

- Advertisement -

శ్రీ లీలా సపోర్ట్ కూడా ఆ టీం కే

రీసెంట్ గా ఐపీఎల్ సీజన్ మొదలైంది సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్లో చాలామందికి తమకంటూ ఒక సొంత ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి. అలానే శ్రీ లీల కి కూడా ఒక ఫేవరెట్ టీం ఉంది అదే ఆర్ సి బీ. గజినీ మహమ్మద్ దండయాత్రకి వెళ్ళినట్లు ఐపిఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి ఈ సాలా కప్ నమదే అంటుంటుంది ఆర్ సి బి టీం. ఇప్పుడు అదే మాటను శ్రీ లీలా కూడా అంటుంది. రీసెంట్ గా ప్లే ఆఫ్ కి సెలెక్ట్ అయింది ఈ టీం. అయితే శ్రీ లీల దీనికి ఇప్పుడు రెస్పాండ్ అయింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ టీం కి కప్ అనేది లభించలేదు. రీసెంట్ గా ఆర్ సి బి కి లేడీ క్రికెట్ టీం కప్ ను తీసుకొచ్చింది. అయితే ఈసారి కచ్చితంగా కప్పు మనకే వస్తుంది అంటూ ట్వీట్ చేసింది శ్రీ లీలా. దీనికి కొంత స్పందిస్తూ మన టీం ఎస్ ఆర్ హెచ్ అంటున్నారు. కొంతమంది మాత్రం ఎందుకు ఇంత లేట్ చేసావ్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు