Sreeleela : ఆ హీరోయిన్ భర్తతో శ్రీలీల రొమాన్స్.. బాలీవుడ్ లో ఎంట్రీ కన్ఫామ్..

Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు తెలియని వాళ్లు ఉండరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వరుస సినిమాల్లో నటించింది… అది కూడా రవితేజ, బాలయ్య వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. మొదటి సినిమా పెళ్లి సందడి ఆమెకు హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న పాప సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్ చేయబోతుందని టాక్..

గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేక పోయింది.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. లేటెస్ట్ ఫొటోలతో యంగ్ బ్యూటీ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు అన్ని ఇండస్ట్రీలో పాగా వేసేందుకు అమ్మడు ట్రై చేస్తుంది.

Sreeleela's romance with that heroine's husband... entry confirmed in Bollywood..
Sreeleela’s romance with that heroine’s husband… entry confirmed in Bollywood..

బాలీవుడ్‌ లో ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. హీరోయిన్ కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రా ‘మిట్టి’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. బల్వీందర్‌ సింగ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ కథ విన్న వెంటనే సిద్ధార్థ్‌ సరసన నటించడానికి అంగీకారం తెలిపింది శ్రీలీల. ఈ చిత్రంతో తన బాలీవుడ్‌ ప్రయాణం ప్రారంభం కాబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. అక్టోబర్ మొదటి వారంలో సినిమా సెట్స్ మీదకు రాబోతున్నట్లు టాక్.. తెలుగులో నితిన్, రవితేజ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. అలాగే బాలీవుడ్ లో కూడా బంఫర్ ఆఫర్ పట్టేసిందని టాక్.. త్వరలోనే ఈ సినిమాలను అనౌన్స్ చేయబోతుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు