SreeMukhi : హాట్ అందాలతో రెచ్చిపోయిన శ్రీ ముఖి

sri mukhi photos goes viral: టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దదన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది నటీనటులు ఉన్నారు. హీరోయిన్లు, హీరోలు, సైడ్ క్యారెక్టర్ పాత్రలు చేసే నటీనటులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలాగే యాంకర్లు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగానే ఉన్నారు. కొంతమంది మొదట సినిమాలు చేసి ఆ తర్వాత యాంకర్లుగా మారారు. మరి కొంతమంది యాంకర్ గా పనిచేస్తూనే సినిమాలు చేస్తున్నారు. తెలుగు యాంకర్లు అంటే మొదటగా పేరు వినిపించేది సుమ, అనసూయ, శ్రీముఖి, రష్మి.

శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు తన యాంకరింగ్ తో అదరగొడుతూనే సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే బిగ్ బాస్ షోకు వెళ్లి రన్నరప్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ రియాల్టీ షోలో కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. సినిమా ఈవెంట్లు, స్పెషల్ ఈవెంట్లు ఇలా అన్నింటినీ చేస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జూనియర్ సుమ అనే పేరు కూడా తెచ్చుకొని అందరినీ తెగ అలరిస్తోంది.

sri mukhi photos goes viral

యాంకర్ శ్రీముఖి ఎన్నో షోలు చేస్తూ ఉంటుంది. కానీ శ్రీముఖికి మంచి పేరు, పఖ్యాతలు తెచ్చింది పటాస్ షో మాత్రమే. ఈ షోలో యాంకర్ రవితో పాటు కలిసి చేసేది శ్రీముఖి. దీంతో యాంకర్ రవి మరియు శ్రీముఖి మధ్య ఏదో ఎఫైర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా తన టాలెంట్ నిరూపించుకుంది శ్రీముఖి. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా అలాగే యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు.

- Advertisement -

యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అలా ఇప్పటికే చాలాసార్లు తన అందాలను ఆరబోసింది. ఇక లేటెస్ట్ గా వైట్ డ్రెస్ వేసుకుని డిఫరెంట్ గెటప్ లో కనిపించింది శ్రీముఖి. వైట్ కలర్ డ్రెస్ వేసుకొని, ఒళ్లంతా కాస్ట్యూమ్స్ వేసుకుని కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఆమె గత కొంతకాలంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తుందని…. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. మరో రెండు నెలల్లోనే తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని శ్రీముఖి అఫీషియల్ గా ప్రకటిస్తుందని అంతా అనుకుంటున్నారు. వచ్చే వర్ష కాలం లోనే శ్రీముఖి మెడలో మూడు ముళ్ళు పడబోతున్నాయట. కానీ ఈ వార్తపై శ్రీముఖి కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.sri mukhi photos goes viral

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు