Balakrishna: నా భార్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. బాలయ్య అల్లుడు కామెంట్స్..!

Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్బస్టర్ లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య 60 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. తన డైలాగులతో అండ్ నటనతో జై బాలయ్య అనిపించుకుంటున్నాడు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

అతని ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తన కొడుకు కంటే చిన్న కూతురు తేజస్విని ముందుగానే ఇండస్ట్రీకి అడుగుపెట్టిందన్న సంగతి తెలిసిందే. ఆమె డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు రాకపోయినా తెర వెనుక మాత్రం బాలయ్య సినిమాలకు ఎంతో కృషి చేస్తూ తన తండ్రి విజయాలకు కారణం అవుతుంది. అదేవిధంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమం అంత మంచి సక్సెస్ అయిందంటే దాని వెనుక తేజస్విని కృషి చాలా ఉంది.

Sri Bharath comments on balayya daughter Tejaswini
Sri Bharath comments on balayya daughter Tejaswini

ఇక ఆమె భర్త శ్రీ భరత్ ప్రముఖ విద్యావేత్త. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భరత్ భార్య తేజస్విని గురించి కామెంట్స్ చేశారు. తేజస్విని చాలా టాలెంటెడ్ అండ్ క్రియేటివిటీ కలిగిన అమ్మాయి అని.. ఆమె కనుక ఇండస్ట్రీకి వచ్చి ఉంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యేదని శ్రీ భరత్ అన్నారు. ప్రజెంట్ ఈయ‌న‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు