Sri Hari: జిమ్నాస్టిక్ లో నిపుణుడు.. ఏషియన్ గేమ్స్ కి వెళ్లకపోవడానికి కారణం..?

Sri Hari.. విలక్షణ నటుడు శ్రీహరి.. హీరోగా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ప్రతిపాత్రలో కూడా నటిస్తూ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి.. విలక్షణ నటుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్నారు.. ఇక ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి నేడు మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఎప్పటికప్పుడు ఆయన నటనను ఆయన ప్రతిభను గుర్తు చేస్తూనే ఉంటాయి. సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే కాదు మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తి కూడా.. సహాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి.. లేదనకుండా సహాయం చేసే గొప్ప గుణం కలిగిన మనిషి.. ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆయన గురించి.. ఆయన మంచితనం గురించి.. ఆయన నుంచీ సహాయం పొందిన వారు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు..

Sri Hari: Expert in gymnastics.. Reason for not going to Asian Games..?
Sri Hari: Expert in gymnastics.. Reason for not going to Asian Games..?

స్టంట్ మాస్టర్ నుంచీ హీరోగా ప్రయాణం..

స్టంట్ మాస్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన శ్రీహరి అంచలంచెలుగా ఎదిగి నటుడిగా స్థిరపడ్డారు.1989లో తమిళ సినిమా మా పిళ్ళై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత దాదాపు 100 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.. ఈయన అద్భుతమైన పాత్రలతో నటించి మెప్పించారు కూడా.. మగధీర సినిమాలో ఈయన పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది.. షేర్ ఖాన్ పాత్రలో గంభీరమైన గొంతుతో డైలాగులు చెప్పి ఆడియన్స్ ఫిదా చేశారు ..ఇక ఈయన హీరోగా నటించిన కుబుసం, భద్రాచలం సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమాలో అటు కామెడీ ఇటు విలనిజం రెండు కూడా పాత్రకు జీవం పోసాయి. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, మగధీర, కింగ్ ,తుఫాన్ వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.. ఇకపోతే ఇన్ని చేసిన ఈయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు అనే విషయం అభిమానులలో సందేహంగా మారింది.

జిమ్నాస్టిక్స్ లో నిపుణుడు..

నిజానికి సినిమాల్లోకి రాకముందు జిమ్నాస్టిక్స్ లో రాష్ట్రస్థాయి ఛాంపియన్.. అయితే అథ్లెట్ అవ్వాలని అనుకున్నారు.. జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ లో పాల్గొనాల్సి ఉన్నా .. సినిమాల పైన మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. అలాగే సినిమాల్లోకి రాకముందు ఏడు సార్లు మిస్టర్ హైదరాబాద్ అవార్డును కూడా దక్కించుకున్నారు..

- Advertisement -

చివరి కోరిక అదే..

అయితే ఆయన చివరి కోరిక ఒకటే.. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక.. కానీ సినిమాల్లోకి రావడం కారణంగా తన కలను నెరవేర్చుకోలేకపోయారు. అయితే సినిమాలలో సెటిల్ అయిన తర్వాత ఏషియన్ గేమ్స్ లో పాల్గొనాలని అనుకున్నప్పటికీ.. ఆయన భూమిపైన లేరు.. అలా అనుకున్న కలను నెరవేర్చుకోలేక ఇండస్ట్రీకే కాదు ఏకంగా లోకానికే దూరం అయిపోయారు శ్రీహరి. ఇకపోతే జిమ్నాస్టిక్స్ చేస్తారని.. అందులో ఛాంపియన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీహరి చివరి కోరిక తీరకుండానే మరణించడం బాధాకరమని చెప్పుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు