Sridevi: శ్రీదేవి కోసం బాల్కనీ నుంచి దూకేసిన నిర్మాత..!

టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి అందాల తారగా పేరుపొందింది హీరోయిన్ శ్రీదేవి.. ఈమె అందానికి, నటనకు సైతం ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు.. ఇలాంటి నటిని బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్ ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే బోనీకపూర్ శ్రీదేవిని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. అందుకు కారణం శ్రీదేవి పైన ఉన్న ప్రేమే కారణమని ఎన్నోసార్లు నిరూపించారు బోనీకపూర్.

శ్రీదేవి మీద ప్రేమతో అలాంటి పని..

Sridevi: The producer jumped from the balcony for Sridevi..!
Sridevi: The producer jumped from the balcony for Sridevi..!

శ్రీదేవి మీద ప్రేమతో బాల్కనీ నుంచి కూడా దూకేసారట.. మరి ఆ సాహసం ఎందుకు చేయవలసి వచ్చిందని విషయానికి వస్తే.. శ్రీదేవి మరణించిన తర్వాత ఆమె కూతురు జాన్వీ కపూర్ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. పలు విషయాలను తెలియజేసింది. శ్రీదేవి, బోణి కపూర్ వివాహానికి ముందే చాలా ఏళ్లపాటు రహస్యంగా డేటింగ్ చేశారట.. వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు వచ్చాయని కూడా తెలుస్తోంది. అప్పటికే స్టార్ హీరోయినిగా పలు సినిమాలలో నటించిన శ్రీదేవి ఒకానొక సమయంలో ఇతర ప్రాంతాలలోకి వెళ్లి కూడా షూటింగులు చేస్తూ ఉండేది.

శ్రీదేవికి సడన్ సర్ప్రైజ్..

అలా బెంగళూరులో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీదేవి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి బోనీకపూర్ ఆమెకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. అలా ఇద్దరు గంటలకు గంటలు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆ మాటలు వింటూ శ్రీదేవి అలాగే నిద్రపోయిందట. అలా నిద్రపోయిన తర్వాత ఆమె అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్ గా శ్రీదేవికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని భోణి కపూర్ నిర్ణయించుకున్నారు. అలా రాత్రికి రాత్రే బొంబాయి నుంచి బెంగళూరుకి వెళ్లిపోయారు బోనీకపూర్. తన సినిమా షూటింగ్ షెడ్లో సడన్గా బోనీ కపూర్ను చూసి శ్రీదేవి ఆశ్చర్య పోయిందట. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న టీం మొత్తం శ్రీదేవి రూమ్ కి క్యూ కట్టారు.

- Advertisement -

శ్రీదేవి కోసం గోడదూకిన బోనీకపూర్..

ఈ విషయం గమనించిన శ్రీదేవి వెంటనే ఉన్నఫలంగా భోణి కపూర్ ను వెనక డోర్ నుంచి వెళ్ళమని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న బాల్కనీ నుంచి కిందికి దూకేశారట. దీంతో బోనీ కపూర్ కి కూడా చిన్నచిన్న గాయాలయ్యాయని జాన్వీ కపూర్ తెలియజేసింది.. అయితే ఈ విషయాలన్నీ శ్రీదేవి అప్పుడప్పుడు తన తండ్రి గురించి వివరిస్తూ తన మీద ఉన్న ప్రేమను కూడా ఇలా బయట పెడుతూ ఉండేదట. ఇంత ప్రేమ ఉన్న తన తండ్రి మీద తన తల్లి మరణంతో కొంతమంది నిందలు వేశారని కూడా తెలియజేసింది జాన్వీ కపూర్.

జాన్వీ కపూర్ సినిమాలు..

ఇక జాన్వి కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ భారీ క్రేజ్ దక్కించుకోవడమే కాదు ఇక్కడ తెలుగులో కూడా పలు సినిమాలను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ… రామ్ చరణ్ , బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న సినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు