Srikanth Odela: మరోసారి హై స్టాండర్డ్స్ సెట్ చేసే క్యారెక్టర్

Srikanth Odela: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులుగా నిరూపించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక సరైన అవకాశం దొరికితే మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ అందుకొని వాళ్లకంటూ కొంత క్రేజ్ ని సాధించుకుంటారు. అలా దర్శకుడిగా నిరూపించుకోవడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఇకపోతే చాలా ప్రయత్నాలు చేసి దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం సాధించి అక్కడే మంచి వర్క్ నేర్చుకున్నాడు. ఇకపోతే ఎట్టకేలకు ఒక అవకాశాన్ని సాధించి నానితో దసరా అనే సినిమాను చేశాడు.

ఇక దసరా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను ఎస్ఎల్వి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్యానర్ కి దసరా సినిమా మినహాయిస్తే ఒక్క హిట్టు కూడా లేదు. ఈ బ్యానర్ కి మాత్రం మంచి గౌరవం ఉంది. ఎందుకంటే ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఫెయిల్ అయినా కూడా మంచి సినిమాలు చేస్తారు అని ఒక అభిప్రాయం ఉంది. ఇకపోతే దసరా సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతోనే నాని 100 కోట్లు మార్కెట్లోకి అడుగుపెట్టాడు. దసరా సినిమా కథ చెప్పిన వెంటనే శ్రీకాంత్ కి ఒక మినిమం బడ్జెట్ ఇచ్చి ఒక సీన్ షూట్ చేసి రమ్మని చెప్పాడు చెప్పాడు. అయితే ఆ బడ్జెట్ తో శ్రీకాంత్ చేసిన వర్క్ బాగా నచ్చి దసరా సినిమాకి అవకాశం ఇచ్చాడు నాని.

Nani-Srikanth Odela

- Advertisement -

ఇక దసరా సినిమాలో నాని పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక డిఫరెంట్ వేరియేషన్ ని నాని క్యారెక్టర్ లో తీసుకొచ్చి చూపించాడు శ్రీకాంత్. ఇప్పుడు మళ్లీ నాని తో మరో సినిమాను చేయనున్నాడు శ్రీకాంత్. అయితే ఈ సినిమాలో నానిని మరికొంత డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నానికి మరింత హై స్టాండర్డ్ సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట శ్రీకాంత్. ఒక శ్రీకాంత్ చేయబోయే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు