Srikanth Odela: నువ్వు వేరే అన్న, బాంఛెత్ – దసరా దర్శకుడు వైరల్ పోస్ట్

Srikanth Odela: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులుగా నిరూపించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక సరైన అవకాశం దొరికితే మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ అందుకొని వాళ్లకంటూ కొంత క్రేజ్ ని సాధించుకుంటారు. అలా దర్శకుడిగా నిరూపించుకోవడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఇకపోతే చాలా ప్రయత్నాలు చేసి దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం సాధించి అక్కడే మంచి వర్క్ నేర్చుకున్నాడు. ఇకపోతే ఎట్టకేలకు ఒక అవకాశాన్ని సాధించి నానితో దసరా అనే సినిమాను చేశాడు.

ఇక దసరా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను ఎస్ఎల్వి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్యానర్ కి దసరా సినిమా మినహాయిస్తే ఒక్క హిట్టు కూడా లేదు. ఈ బ్యానర్ కి మాత్రం మంచి గౌరవం ఉంది. ఎందుకంటే ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఫెయిల్ అయినా కూడా మంచి సినిమాలు చేస్తారు అని ఒక అభిప్రాయం ఉంది. ఇకపోతే దసరా సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతోనే నాని 100 కోట్లు మార్కెట్లోకి అడుగుపెట్టాడు. దసరా సినిమా కథ చెప్పిన వెంటనే శ్రీకాంత్ కి ఒక మినిమం బడ్జెట్ ఇచ్చి ఒక సీన్ షూట్ చేసి రమ్మని చెప్పాడు చెప్పాడు. అయితే ఆ బడ్జెట్ తో శ్రీకాంత్ చేసిన వర్క్ బాగా నచ్చి దసరా సినిమాకి అవకాశం ఇచ్చాడు నాని.

Dasara

- Advertisement -

ఇక దసరా సినిమాలో నాని పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక డిఫరెంట్ వేరియేషన్ ని నాని క్యారెక్టర్ లో తీసుకొచ్చి చూపించాడు శ్రీకాంత్. రీసెంట్ గా డెబ్యూ డైరెక్టర్ గా శ్రీకాంత్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ చేశాడు శ్రీకాంత్. దసరా సినిమా మొదటిది షూటింగ్ వీడియో తో పాటు అవార్డు అందుకుంటున్న ఫోటోని కూడా పెట్టాడు. అవి పోస్ట్ చేస్తూ నాని గురించి చాలా ఆసక్తికరంగా రాసుకొచ్చాడు. “నువ్వు వేరే అన్న, బాంఛెత్. యూ డిఫైన్ దసరా. థాంక్యూ ఫర్ ఇన్స్పైరింగ్ మి నాని అన్నా ” అంటూ పోస్ట్ చేశాడు. ఊరికే వీడియో పోస్ట్ చేయాలనిపించింది అని చెప్పాడు శ్రీకాంత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు