Tollywood: సినిమాల్లోనే కాదు, అక్కడ కూడా శ్రీలీల హిట్టే..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ బాబు హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమా ద్వారా పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కన్నడ భామ శ్రీలీల.పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయినా శ్రీలీలకి మాత్రం బాగానే ఆఫర్లు తెచ్చిపెట్టింది. తర్వాత రవితేజతో  నటించిన ధమాకాలో అందం అభినయంతోనే కాకుండా తన డాన్స్ తో అందరిని అలరించి తెలుగులో రెండో సినిమాతోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ధమాకా ద్వారా టాలీవుడ్ ని షేక్ చేసిన శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించే అవకాశం దక్కించుకుంది. అంతే కాకుండా నితిన్31, బాలకృష్ణ 108వ సినిమా వంటి వరుస ఆఫర్లతో అరడజనుకి పైగానే ప్రాజెక్ట్స్ ఈ  బ్యూటీ లైనప్ లో ఉన్నాయి.

సినిమాల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోవటమే కాకుండా షాప్ ఓపెనింగ్స్ విషయంలో శ్రీలీల తన క్రేజ్ చాటుకుంటోంది. తరచూ ఎక్కడో ఒకచోట షాప్ ఓపెనింగ్స్ కి హాజరవుతూ సందడి చేస్తోంది. అటు సినిమాల్లో, ఇటు షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్న శ్రీలీల దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను బాగానే వంట పట్టించుకున్నట్లుంది.

సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రీలీల షాప్ ఓపెనింగ్స్ కి హాజరయ్యేందుకు భారీ మొత్తంలోనే డిమాండ్ చేస్తోంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, డబ్బు మోజులో పడి వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ పిలిచిన ప్రతి షాప్ ఓపెనింగ్ కి వెళుతూ ఉంటే జనాలకు బోర్ కొట్టి క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకుంటే టాప్ హీరోయిన్స్ ని మించిపోయే ఫీచర్స్ ఉన్న ఈ కిన్నడ బ్యూటీ పాన్ ఇండియన్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు