Sreeleela: అభిమానికి చెప్పులు అందించిన శ్రీలీలా

Sreeleela: ప్రస్తుతం తెలుగు లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీలా ఒకరు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీలా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా డిజాస్టర్ అయిన కూడా శ్రీలీలా కు మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే సినిమా ఫెయిల్ అయినా కూడా అవకాశాలు పొందుకున్న అతి తక్కువ మందిలో శ్రీ లీలా ఒకరు అని చెప్పొచ్చు. ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోల సరసన కూడా లీల నటిస్తుంది. రీసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుకి జోడిగా గుంటూరు కారం సినిమాలో కూడా కనిపించింది శ్రీ లీల. ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా కనిపించనుంది. కేవలం యంగ్ హీరోస్ మాత్రమే కాకుండా చాలామంది సీనియర్ హీరోస్ గా కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఇక శ్రీ లీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 75వ సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తుంది. ఇదివరకే రవితేజ శాసన ధమాకా సినిమాలో నటించే అద్భుతమైన హిట్ సినిమాను అందుకుంది. శ్రీ లీల కేవలం యాక్టింగ్ పరంగానే కాకుండా డాన్సులు పరంగా బాగా పాపులర్ అయింది.

Sreeleela

- Advertisement -

 

ఇకపోతే రీసెంట్ గా మరో వీడియోతో వైరల్ అవుతుంది శ్రీ లీల. ఎయిర్పోర్టులో దిగిన శ్రీ లీల నడుచుకుంటూ వస్తుంటే ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఆ వ్యక్తి వీడియో తీస్తూ వెనక్కి జరిగే ప్రాసెస్లో తన చెప్పును వదిలేసాడు. అయితే ఆ చెప్పు నీ తన కాళ్లతో ఆ అభిమానికి అందించింది శ్రీ లీల. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కి బ్యాక్ గ్రౌండ్ లో పుష్ప పాటను యాడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఆ వ్యక్తి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టెప్ మాదిరిగానే ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు