Viswam : ఆ సీక్వెన్స్ రీ క్రియేట్ చేస్తున్న వైట్ల.. ఉన్న పరువు పోగొట్టుకుంటాడా ఏంటి?

Viswam : టాలీవుడ్ లో ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న శ్రీనువైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన ఈ దర్శకుడు నెంబర్ వన్ డైరెక్టర్ల రేసులో కూడా ఉండేవాడు. పైగా ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన దర్శకుడీయన. ఆ రోజుల్లో శ్రీనువైట్ల కామెడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. కామెడీ సినిమాలతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అయితే గత పదేళ్లలో శ్రీనువైట్ల హవా మొత్తం పోయింది. ఏకంగా ఫేడౌవుట్ అయ్యాడని చెప్పాలి. అయినా కూడా శ్రీను వైట్ల తో ఉన్న సాన్నిహిత్యం వల్ల రవితేజ లాంటి హీరోలు మంచి ఛాన్స్ ఇచ్చినా సరిగా వాడుకోలేదు. చివరగా ఆరేళ్ళ కింద అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో పలకరించిన శ్రీను వైట్ల ఇప్పడు ‘గోపీచంద్’ తో ‘విశ్వం’ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

Srinu vytla Recreating the Venky train scene in Viswam Movie

ఐకానిక్ ట్రైన్ సీన్ రిపీట్…

ఇక శ్రీను వైట్ల దర్శకుడిగా గోపీచంద్ తో విశ్వం (Viswam) అంటూ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ 80 శాతం పూర్తవగా, రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక విశ్వం సినిమాలో ఒక శ్రీనువైట్ల తీసిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒక ఐకానిక్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయనున్నారట. లేటెస్ట్ గా విశ్వం జర్నీ పేరుతో మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఈ సినిమాలో ఒక ట్రైన్ సీన్ లో పూర్తిగా అరగంట పాటు సాలిడ్ కామెడీ ట్రాక్ ని పెడుతున్నట్టు సమాచారం అందింది. మేకింగ్ వీడియోలో కూడా అది చూపించారు. ఆ ట్రైన్ సీన్ లో సీనియర్ నరేష్, ఆర్టిస్ట్ ప్రగతి, అలాగే అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ట్రైన్ సీన్ అనగానే ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.

- Advertisement -

వైట్ల ఉన్న పరువు కాస్తా పోగొట్టుకుంటాడా?

అయితే ట్రైన్ సీన్ అనగానే టాలీవుడ్ లో అందరికి వెంటనే గుర్తొచ్చే సినిమా ‘వెంకీ’. రవితేజ నటించిన ఈ సినిమాను శ్రీనువైట్లనే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది ఈ ట్రైన్ ఎపిసోడే. దాదాపు వెంకీ ఫస్ట్ హాఫ్ లో ఒక యాభై నిమిషాల దాకా ఈ ట్రైన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ల లో రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్ ల మధ్య కామెడీ మామూలుగా ఉండదు. వెంకీ బ్లాక్ బస్టర్ కావడానికి ట్రైన్ ఎపిసోడ్ ఎంతో ప్లస్ అయింది. పైగా ఈ ట్రైన్ సీన్ లో బ్రహ్మీ, రవితేజ ఐకానిక్ ఎక్స్ప్రెషన్లతో కూడిన స్టిల్స్ సోషల్ మీడియాలో మీమ్స్ పేజీ లో ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. మొన్నటికి మొన్న సినిమా రీ రిలీజ్ అయితే ఈ సీన్స్ కి థియేటర్లో మోత మోగింది. ఇప్పుడు ఈ ట్రైన్ సన్నివేశాన్ని మళ్ళీ శ్రీను వైట్ల విశ్వం లో రీ క్రియేట్ చేస్తున్నాడు.

ఇంతకు ముందు కూడా ఎంతో మంది డైరెక్టర్లు పలు సినిమాల్లో ట్రైన్ కామెడీలు ట్రై చేసినా వర్కౌట్ అవలేదు. కొన్ని వర్కౌట్ అయినా వెంకీ రేంజ్ లో దేనికి రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే తరహా వింటేజ్ రైలు సీన్ ని శీనువైట్ల విశ్వంలో వాడారు. అయితే మేకింగ్ వీడియో చూసాక చాలామంది నెటిజన్లు వెంకీ సినిమా రేంజ్ లో మళ్ళీ తీయడానికి ప్లాన్ చేస్తే ఉన్న పరువు పోతుంది అని శ్రీనువైట్లని ట్రోల్ చేస్తున్నారు. కామెడీ కంటెంట్ బాగుంటే సినిమాకి ఏమైనా ప్లస్ అవుతుందేమో గాని, ఆ సీన్ మిస్ ఫైర్ అయితే శ్రీనువైట్ల షెడ్డుకెళ్లిపోవాల్సిందే అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలే పదేళ్లుగా సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న శ్రీనువైట్ల మరి ‘విశ్వం’ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు