SSMB28 : రూమర్స్ కు చెక్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ముచ్చటగా మూడో సారి సెట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు ఈ కాంబోలో వచ్చాయి. తాజాగా ఇప్పుడు SSMB28 రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే.. మహేష్ కోరిక మేరకు త్రివిక్రమ్ SSMB28 స్క్రిప్ట్ ను మార్చేశారట. పూర్తిగా కొత్త కథతో ఈ సినిమా రాబోతుందని సమాచారం.

ముందుగా అనుకున్న కథ ప్రకారం.. సినిమాలో నటీనటులను, మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు స్టోరీ మారింది కాబట్టి.. కాస్ట్ అండ్ క్రూను మార్చాలని త్రివిక్రమ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ను కూడా మార్చాలని త్రివిక్రమ్ కు మహేష్ సూచించినట్టు గత మూడు రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. థమన్ స్థానంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను తీసుకుంటున్నారని టాక్ వచ్చింది.

తాజాగా దీనిపై నిర్మాత సూర్య దేవర నాగ వంశీ స్పందించాడు. SSMB28పై వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలచ్చి చెప్పాడు. తమ సినిమాలో థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ అని తెల్చి చెప్పాడు. మ్యూజిక్ డైరెక్టర్ విషయం లో తాము ఎలాంటి మార్పులు చేయడం లేదని చెప్పారు. నాగ వంశీ వ్యాఖ్యలతో SSMB28పై ఇప్పటి వరకు రూమర్స్ కు బ్రేకులు పడ్డాయి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు