SSMB29: అన్నీ పుకార్లే హిరోయిన్ ఇంకా సెట్ కాలేదు

SSMB29: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంచలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. ఎక్కడో ఉన్న తెలుగు సినిమాని శిఖరం మీద నిల్చోబెట్టిన ఘనత ఎస్ ఎస్ రాజమౌళి ది అని చెప్పొచ్చు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి, ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక ప్లాప్ సినిమా కూడా తీయకుండా ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. అయితే ఇప్పటివరకు రాజమౌళి చేసిన హీరోలు అందరికీ కూడా మంచి స్టార్ డంను అందించాడు. కానీ ఆల్రెడీ స్టార్ డం ఉన్న హీరోతో మాత్రం చేయడం ఇదే మొదటిసారి.

ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. మహేష్ తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ సినిమాలు రీ రిలీజ్ అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఒక ప్లాప్ సినిమాతో కూడా అద్భుతమైన కలెక్షన్స్ను పెట్టగలిగే సామర్థ్యం ఉన్న నటులు వీళ్లిద్దరు.

SS Rajamouli

- Advertisement -

లుక్స్ వైరల్

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. మహేష్ బాబు కెరియర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. అయితే ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రిలీజ్ అయ్యేసరికి నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా మహేష్ బాబు లుక్స్ కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి. బయట కొన్ని ఫంక్షన్స్ లో మహేష్ కనిపించడంతో చాలామందికి మహేష్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అని ఒక అంచనా మొదలైంది.

మహేష్ కి జోడి సెట్ అయిందా

ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబుకి జోడిగా సెట్ అయిపోయారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే మహేష్ సరసన జాన్వీ కపూర్ కరెక్ట్ జోడి అని రాజమౌళి అనుకుంటున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి. ఈ వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలానే హీరోయిన్ గా చెల్సీ ఎలిజబెత్ కూడా మహేష్ కు జంటగా నటిస్తుందని వార్తలు వచ్చాయి వాటిలో కూడా నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతుంది. ప్రముఖ రచయిత సాయి మాధవ బుర్ర ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు