SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమాకి మరో కొత్త టైటిల్

SSMB29: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీసెంట్ గా గుంటూరు కారం అనే సినిమాను చేసి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు మహేష్ బాబు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. బేసిగ్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అంటేనే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన అతడు ఖలేజా వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయం సాధించలేకపోయిన కూడా ఇప్పటికీ టీవీల్లో వస్తే హైయెస్ట్ టీఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటాయి. ఇకపోతే గుంటూరు కారం సినిమా యూత్ కి కనెక్ట్ అవ్వకపోయినా కూడా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను సేఫ్ జోన్ లో పెట్టారు.

ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఒక సినిమా తీయడానికి ఎంత టైం తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు పాటు రామ్ చరణ్ మరియు తారక్ ను లాక్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబును కూడా అలానే లాక్ చేయనున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రాజమౌళి అన్ని సినిమాలు కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని వాళ్ళు ఇంటర్వ్యూస్ లో విజయేంద్ర ప్రసాద్, రాంగోపాల్ వర్మ వంటి సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు.

Mahesh Babu

- Advertisement -

అయితే ఈ సినిమాకి టైటిల్ అంటూ కొన్ని పేర్లు బయటికి వచ్చాయి. రీసెంట్ గా మహారాజా అనే టైటిల్ కూడా ఈ సినిమాకు ఖరారు చేసినట్లు సమాచారం వినిపించింది. ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ వినిపిస్తుంది. ఈ సినిమాకి గోల్డ్ అని టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇకపోతే ఈ టైటిల్ విన్న కొంతమంది మహేష్ బాబు అభిమానులు బాబు బంగారం అంటూ చిన్నగా సెలబ్రేషన్స్ కూడా మొదలు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు