SSMB29: మహేష్ బాబు బర్త్ డే ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి

SSMB29: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ సార్ మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మురారి వంటి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన మహేష్ బాబు ఒక్కడు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకొని స్టార్ హీరోగా మారిపోయాడు. ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు. గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించిన విధానం అద్భుతం. ఇప్పటికీ ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఈ సినిమాను గుణశేఖర్ ఎలా తీశాడు అని అనిపించేలా ఉంటుంది.

అలానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. రీసెంట్ గా ఈ సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు కూడా ప్రేక్షకులు బీభత్సంగా బ్రహ్మరథం పట్టారు. మహేష్ బాబు క్రేజ్ ఏంటో మరోసారి బాక్సాఫీస్ వద్ద చూపించారు. ఇకపోతే అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా మహేష్ బాబు ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాను చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే.

Mahesh Babu

- Advertisement -

ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక ఫెయిల్యూర్ సినిమా కూడా చేయలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన ఎస్ఎస్ రాజమౌళి పరిచయం నేటికీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా స్థాయికి పరిచయం చేసిన ఘనత ఎస్.ఎస్ రాజమౌళికి ఉంది. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అని అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు