Star Actor: ఆడు జీవితంలో నటించి తప్పు చేశా- నటుడు కామెంట్స్ వైరల్..!

Star Actor.. మలయాళ సినీ ఇండస్ట్రీలోనే బెస్ట్ చిత్రంగా పేరు పొందిన చిత్రాలలో ది గోట్ లైఫ్ (The Goat life)చిత్రం కూడా ఒకటి. దీనిని తెలుగులో ఆడు జీవితం అంటూ డబ్బింగ్ చేశారు. ఈ సినిమా కొన్నేళ్లపాటు షూటింగ్ జరుపుకొని.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బెన్నీడాయల్ రాసినటువంటి గోట్ డేస్ అనే నవల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ బ్లేస్సి. ఇందులో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran)అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో ఒక మోస్తారుగా ఆడినా.. మలయాళం లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాకు ఈయనకు బెస్ట్ అవార్డు వస్తుందనే విధంగా మాట్లాడుకుంటున్నారు.

Star Actor: I made a mistake in acting in my life- Actor's comments went viral..!
Star Actor: I made a mistake in acting in my life- Actor’s comments went viral..!

ఇందులో నటించి తప్పు చేశాను, క్షమించండి..

ఈ సినిమా ఓటీటిలో కూడా విడుదలై మంచి టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికీ కొన్ని నెలలు అవుతున్నా.. ఈ సినిమాలో నటించిన అకీమ్ నజీమ్ ఈ సినిమా కథ స్క్రిప్ట్ ను తాను పూర్తిగా తెలుసుకోకుండానే చేశాను తనను క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే సౌదీ అరేబియన్ గా తన పాత్రని సినిమాలో నెగిటివ్ గా చూపించారనే విషయం పైన చాలామంది మండిపడుతున్నారట.

సౌదీ అరేబియన్స్ అకీమ్ నజీమ్ పై ఫైర్..

అకీమ్ నజీమ్ వాస్తవానికి సౌదీ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం చేత నువ్వు అలా ఎలా నటిస్తావు అంటూ సోషల్ మీడియాలో ఈ నటుడు పైన సౌదీ అరేబియన్స్ ఫైర్ అవుతున్నారట. తనని దేశం నుంచి కూడా బహిష్కరించాలి అంటూ చాలామంది డిమాండ్ చేస్తూ ఉండడంతో పాటుగా సౌదీలో ఇతని చేయబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉండడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆడు జీవితం సినిమా కథను పూర్తిగా చదవలేదని తనకు కేవలం తన పార్ట్ వరకే స్క్రిప్ట్ ని వివరించారని తెలిపారు.

- Advertisement -

కథ తెలియకుండా ఒప్పుకున్నా..

ముఖ్యంగా సినిమా కథలో.. హీరో ఎడారిలో తప్పిపోయి, మరణానికి దగ్గరగా ఉన్న సమయంలో కేవలం ఒక సౌదీ వ్యక్తి రక్షిస్తాడు అనే విధంగా తనకు చెప్పారని తెలిపారు. అకీమ్ నజీమ్. అందుకే తాను కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నానని తెలియజేశారు. ఇది సౌదీలో నివసించే వారి యొక్క సహజ లక్షణం అని తెలిపారు. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాపాడడం అనేది సినిమాలో చూపించబోతున్నారని భావించి చేశానని కానీ సినిమా పూర్తి అయిన తర్వాత చూసి తనకు వ్యతిరేకంగా ఉందని తెలియజేశారు. దీంతో సౌదీ ప్రజలకు క్షమాపణలు కూడా తెలియజేస్తున్నానని వివరణ ఇచ్చారు అకీమ్ నజీమ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు