Star Actress: వివాహేతర సంబంధాలు తప్పుకావు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ యాక్ట్రెస్.!

Star Actress.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇతర భాషా ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా.. ఇప్పుడు అందరి ఫోకస్ కేరళ ఇండస్ట్రీ పైనే అని చెప్పాలి. మలయాళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందనే విషయం నటి భావన అత్యాచారానికి గురైనప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ప్రముఖ హీరో దిలీప్ ఈమె పై అత్యాచారానికి పాల్పడగా చాలామంది ఆ సమయంలో భావనకు అండగా నిలిచారు. అంతేకాదు ఎంతోమంది అమ్మాయిలు ఇలా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము అని ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చెప్పుకున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై నివేదిక సమర్పించాలని, ఒక కమిటీని ఏర్పాటు చేయగా మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది అంటూ జస్టిస్ హేమ ఒక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

Star Actress: Extramarital relations are not wrong.. Star actress made shocking comments.!
Star Actress: Extramarital relations are not wrong.. Star actress made shocking comments.!

క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు వివాహేతర సంబంధాలు కూడా..

ఇదిలా ఉండగా మరొకవైపు క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు వివాహేతర సంబంధాలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవలే కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం హత్య చేసి, ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. అలాగే మరో కన్నడ యంగ్ హీరో యువరాజ్ కుమార్ కూడా వివాహేతర సంబంధంలో మునిగి తేలుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి వివాహేతర సంబంధాలు తప్పు కాదు అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వివాహేతర సంబంధాలు తప్పుకాదు..

ప్రముఖ బాలీవుడ్ నటి షీలూ అబ్రహం.. వివాహేతర సంబంధం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వివాహేతర సంబంధాలకు పాల్పడే వారిని ఎప్పుడూ కూడా నిందించకూడదు అంటూ ఆమె తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైవాహిక జీవితంలో కొన్ని ఆటుపోట్ల వల్ల ఎఫైర్స్ మొదలవుతాయి. అలాంటి బంధాన్ని తప్పని చెప్పలేము కదా.. ఇవన్నీ వారి వ్యక్తిగత స్వేచ్ఛ అలాగే సోషల్ మీడియాలో చర్చకు అసలు రాకూడదు. అంతేకాదు అత్యాచారం చేయడం తప్పు కానీ ఏకాభిప్రాయంతో జరిగే రొమాన్స్ కూడా తప్పు కాదు. కానీ ఇష్ట ప్రకారం శారీరకంగా ఒక్కటై , దాన్ని రేప్ అని క్లైమ్ చేయడం కూడా పద్ధతి కాదు. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా ఎఫైర్స్ గురించి ప్రజలకు నేరుగా తెలియకపోయినా పుకార్లు మాత్రం కొన్ని వార్తల ద్వారా తెలుస్తున్నాయి. గతంలో ప్రియా వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఒమర్ లులు పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అవకాశం ఇప్పిస్తానని శారీరకంగా ఎఫైర్ పెట్టుకున్నాడు అన్న వ్యవహారంపై ఆయనపై కేసు నమోదు అయింది. దీనిపై కూడా ఆమె మాట్లాడుతూ.. ఒమర్ లులు మంచివాడా కాదా అని ఎవరు కచ్చితంగా చెప్పలేరు. స్త్రీ పురుషుల మధ్య ఎఫైర్స్ సర్వసాధారణం. ముఖ్యంగా వీరి మధ్య విభేదాలు అసూయ, ద్వేషం వల్ల ఏర్పడితే, ఇలాంటి కేసులకు దారితీస్తాయి. ఇలాంటి విషయాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పదలుచుకుంటున్నాను అంటూ తెలిపింది. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు