Yuvan Shankar Raja : ఇంటి అద్దె కట్టలేని స్థితిలో స్టార్ డైరెక్టర్ కొడుకు..పోలీస్ కేసు?

Yuvan Shankar Raja : సినిమా ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.. అదృష్టం ఉంటే అంబరం ఎక్కుతారు.. లేకుంటే బిక్ష మెత్తుకోవాలి. చాలా మంది నటులు, టెక్నీషన్స్ పరిస్థితి ఆధ్వనంగా మారుతుంది. కొందరు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఓ స్టార్ డైరెక్టర్ కు పట్టింది. అద్దె ఇంటికి డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నాడు. ఇంతకీ అతనేవరో కాదు.. ఇళయరాజా కొడుకు యువన్ శంకర్ రాజా.. అసలు మ్యాటరేంటో తెలుసుకుందాం..

స్టార్ మ్యూజిక్ లెజెండరీ డైరెక్టర్  ఇళయరాజా తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. తమిళంతో పాటు తెలుగులో ఎన్నో సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోయాడు. చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇంటికి అద్దె రూ. 20 లక్షల ఉంటుంది. దాన్ని చెల్లించలేక రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసినట్లు టాక్. అద్దె చెల్లించకుండా ఇల్లు ఖాళీ చెయ్యడంతో పోలీసులకు ఫిర్యాదు అందినట్లు ఇండస్ట్రీలో టాక్..

Star director's son unable to pay house rent..Police case?
Star director’s son unable to pay house rent..Police case?

విషయానికొస్తే.. నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్‌ శంకర్ రాజా అద్దెకు ఉంటున్నాడు. అక్కడ అద్దె కట్టలేక అక్కడి నుంచి రాత్రికి రాత్రే మకాం మార్చాడు.. ఓనర్ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చెయ్యట్లేదని ఆ ఇంటి ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. భారీ బడ్జెట్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే ఆయన అద్దె కట్టక పోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమాలు విడుదల కాబోతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు