Star Hero: ఓకే సినిమాలో ఏకంగా 45 పాత్రలు.. కమలహాసన్ కూడా తేలిపోయారే..!

Star Hero.. సాధారణంగా ఒక సినిమాలో ద్విపాత్రాభినయం చేయడానికి హీరోలు కష్టపడి పోతూ ఉంటారు. కానీ మరికొంతమంది హీరోలు ఒక అడుగు ముందుకేసి త్రిపాత్రాభినయం చేస్తూ మెప్పిస్తున్నారు. అయితే కమల్ హాసన్ మాత్రం ఏకంగా దశావతారం చూపించి అందరిని ఆకట్టుకున్నారు. ఒక్క సినిమాలో 10 అవతారాలలో కనిపించిన ఏకైక హీరోగా రికార్డ్ సృష్టించారు కమలహాసన్. అయితే ఈయన రికార్డులను సైతం చెరిపే వేశారు ఒక మలయాళ నటుడు.. 1 కాదు.. 2 కాదు.. 10 కాదు.. 20 కాదు ఏకంగా 45 పాత్రలు ఒకే సినిమాలో చేసి సంచలనం సృష్టించారు. మరి ఆయన ఎవరు? ఆ సినిమా ఏంటి? ఆ పాత్రల వివరాలేంటి ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Star Hero: 45 roles in one movie. Kamal Hassan also back..
Star Hero: 45 roles in one movie. Kamal Hassan also back..

దశావతారంతో మెప్పించిన కమల్ హాసన్..

సాధారణంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ నటులు ఉన్నారు.. గొప్ప గొప్ప పాత్రలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ పాత్రలతో ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకే సినిమాలో ఎక్కువ పాత్రలు చేసి అందర్నీ అబ్బురపరిచిన హీరోలలో మొదటిగా వినిపించే పేరు కమలహాసన్. విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన ఇప్పటివరకు చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. ఓకే సినిమాలో విభిన్నమైన పాత్రలలో నటించి వరుస విజయాలు అందుకున్న ఈయన.. ఒకే సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అపూర్వ సోదరులు , మైఖేల్ మదన కామరాజన్ సినిమాలను మొదలుకొని దశావతారం సినిమాల వరకు ఎన్నో టెక్నికల్ ట్రిక్స్ తన సినిమాలలో ప్రవేశపెట్టి , గొప్ప నటుడిగా ఎదిగారు. ఈయన ఫేమస్ పర్సనాలిటీ అందుకే దశావతారంలో చేసిన పది పాత్రలు కూడా గొప్పగా అనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన నటుడిగా కమల్ హాసన్ పేరు నిలిచిపోయింది.

ఇక దక్షిణాది విషయానికొస్తే , ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన వ్యక్తి కమల్ హాసన్ కాదట. అది జాన్సన్ జార్జ్ అనే మలయాళ నటుడు అని సమాచారం. ఈయన ఏకంగా 45 పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. నటుడు జాన్సన్ జార్జ్ 2018లో విడుదలైన మలయాళ చిత్రం ” ఆరను జన్ “చిత్రంలో ఏకంగా 45 పాత్రలు పోషించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందులో గాంధీ, డావిన్సీ, హిట్లర్, వివేకానంద , జీసస్ క్రైస్ట్ మొదలైన పాత్రలు కూడా ఉన్నాయి .ఇది ఆ సంవత్సరం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదయింది. ఇలా దేశంలో ఎంతోమంది గొప్ప నటులు కూడా సాధించలేని రికార్డులను ఈ జాన్సన్ జార్జ్ సాధించారు. ఏది ఏమైనా ఒక సినిమాలో ఏకంగా 45 పాత్రలు చేయడం అంటే ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మొత్తానికి అయితే జాన్సన్ జార్జ్ ఒక సినిమాలో అన్ని పాత్రలు చేసి కమలహాసన్ రికార్డులను బ్రేక్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు