Star Hero: 70 కోట్లతో ముంబైలో ఇల్లు కొన్న స్టార్ హీరో

Star Hero: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూర్య ఒకరు. చాలా తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం సూర్యకి దక్కింది అని చెప్పాలి. ఒకవైపు తమిళ్లో కాకుండా తెలుగులో కూడా సూర్య సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. చాలామంది సూర్యను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దత్తపుత్రుడు అని అంటూ ఉంటారు. అలానే సూర్య చేసిన అన్ని సినిమాల్లో కూడా తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. సూర్య సినిమాలతో పాటు వ్యక్తిత్వానికి కూడా అభిమానులు ఉన్నారు.

Suriya and Jyothika

ఇక సూర్య విషయానికొస్తే తెలుగులో మహేష్ బాబు చాలామందికి ఎలా సాయం చేస్తారో, తమిళ్ లో కూడా సూర్య చాలామందికి సాయం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ అవతలి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. సూర్య అభిమానులతో ప్రవర్తించే తీరు కూడా చాలామందిని ఆకట్టుకుంటుంది. ఇక సూర్య టాలెంట్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆకాశమే హద్దురా వంటి సినిమాలతో నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్న నటుడు.

- Advertisement -

ఇక ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 70 కోట్లను పెట్టి సూర్య ముంబైలో ఇల్లు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య సతీమణి జ్యోతిక కూడా సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆమె వరుసగా హిందీలో ప్రాజెక్టులు సైన్ చేయడం వలన, అక్కడ ఉండేటట్లు ప్లాన్ చేయడం కోసమే 70 కోట్లు పెట్టి ముంబైలో సూర్య ఇల్లు కొనుక్కున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు