Star Hero : భార్య బీ గ్రేడ్ సినిమాల్ని తొలగించడానికి ఆస్తిని కర్పూరంలా కరిగించిన స్టార్ హీరో

Star Hero : తెరపై సూపర్ స్టార్లు కన్పించే నటీనటుల పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. స్టార్ కిడ్స్ అయినప్పటికీ, కోట్ల ఆస్తికి వారసులు అయినప్పటికీ చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. అలా తన భార్య బీ గ్రేడ్ సినిమాలను డిలీట్ చేయించడానికి ఆస్తిని కర్పూరంలా కరిగించిన హీరో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్టార్ హీరో భార్య బీ గ్రేడ్ సినిమాలలో..

మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది బాలీవుడ్ బడా స్టార్ సంజయ్ దత్, ఆయన భార్య మాన్యతా దత్ గురించి. కేజీఎఫ్ తో సంజూకు సౌత్ లో కూడా మంచి పాపులారిటీ దక్కింది. అయితే ఆయన వైఫ్  మాన్యతా దత్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈరోజు మాన్యత పుట్టినరోజు కావడంతో ఆమె ప్రీ మ్యారేజ్ లైఫ్ గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. మాన్యతా దత్ 22 జూలై 1978న ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. మాన్యత అసలు పేరు దిలాన్వాజ్ షేక్. ఆమె ప్రస్తుతం సంజయ్ దత్ ప్రొడక్షన్స్ సీఈవోగా పని చేస్తున్నారు. కానీ మాన్యత ప్రకాష్ ఝా ‘గంగాజల్’లో ఐటెం సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

ముస్లిం కుటుంబంలో పుట్టిన మాన్యత నటిగా స్థిరపడాలనుకుంది. ప్రముఖ నటి కావాలనేది మాన్యత కల. కానీ ఆమె కల నెరవేరలేదు. బాలీవుడ్‌లో ఆఫర్స్ రాకపోవడంతో మాన్యత బి-గ్రేడ్ సినిమాల్లో నటించడం ప్రారంభించింది. దీంతో ఒకానొక సమయంలో ఆమె ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ తరువాత మాన్యత, సంజూ బాబాకు పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది.

- Advertisement -

Bollywood actor Sanjay Dutt and family celebrate Eid in Dubai | Bollywood – Gulf News

ఆమె కోసం ఆస్తిని కర్పూరంలా కరిగించాడు..

కానీ మాన్యత బి-గ్రేడ్ సినిమాల్లో నటించడం సంజు బాబాకు ఇష్టం లేదు. దాంతో ఆయన మాన్యత బీ గ్రేడ్ సినిమా రైట్స్ కొన్నాడు. అందుకు సంజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సమాచారం ప్రకారం సంజూ తన భార్య బి గ్రేడ్ సినిమాల అన్ని హక్కులను కొనుగోలు చేశాడు. దీని కోసం ఆయన ఏకంగా అప్పట్లోనే 20 లక్షల రూపాయలు చెల్లించాడు. అలా సంజయ్ తన భార్యకు సంబంధించిన అన్ని అవాంఛిత వీడియోలను తొలగించడానికి ప్రయత్నాలు చేశాడు.

మరోవైపు సంజయ్ దత్, మాన్యత చాలా సంవత్సరాలు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత 2008లో వివాహం చేసుకున్నారు. చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. సంజయ్ దత్ 50 ఏళ్ల వయసులో మాన్యతను మూడో పెళ్లి చేసుకోవడం మరో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సంజయ్ – మాన్యత ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. కానీ వీరిద్దరి మధ్య దాదాపు 21 ఏళ్ల గ్యాప్ ఉంది. సంజయ్ కంటే మాన్యత 21 ఏళ్లు చిన్నది. అయితే అసలు ఆమె గురించి టాపిక్ ఎందుకు వచ్చింది? అంటే.. ఈరోజు మాన్యత పుట్టినరోజు కావడంతో ఆమె గత జీవితంతో పాటు సంజయ్ కు భార్య అయిన తరువాత లైఫ్ గురించి కూడా చర్చ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు