Star Hero : కూతురు వయసున్న అమ్మాయితో స్పైడర్‌ మ్యాన్‌ ఎఫైర్… గూబ గుయ్ మనేలా రిప్లై ఇచ్చిన మాజీ భార్య

Star Hero : ‘స్పైడర్‌ మ్యాన్‌’ ఫేమ్‌ నటుడు టోబే మాగైర్‌ వ్యవహారంపై ఇటీవల జోరుగా చర్చ సాగుతోంది. తన కూతురు కంటే కేవలం 3 సంవత్సరాలు పెద్ద వయస్సు ఉన్న మోడల్‌తో ఈ స్టార్ హీరో ఎఫైర్‌ నడిపిస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అయితే కూతురు వయసున్న అమ్మాయితో స్పైడర్‌ మ్యాన్‌ ఎఫైర్ ఏంటి? అని ప్రశ్నించిన ఓ నెటిజన్ కు టోబే మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ గూబ గుయ్ మనే రిప్లై ఇచ్చింది.

నెటిజన్ కు ఇచ్చిన పడేసిన మాజీ భార్య

‘స్పైడర్ మ్యాన్’ ఈ వీకెండ్ వారాంతంలో 20 ఏళ్ల మోడల్ లిల్లీ చీతో కనిపించినప్పుడు రూమర్లు మొదలయ్యాయి. న్యూయార్క్‌లోని హాంప్టన్స్‌లో జరిగిన ఫెనాటిక్స్ CEO మైఖేల్ రూబిన్ వార్షిక స్వాతంత్ర్య దినోత్సవ పార్టీకి మెషిన్ గన్ కెల్లీ, మేగాన్ ఫాక్స్, డ్రేక్, మేగాన్ థీ స్టాలియన్, కిమ్ మరియు ఖోలీ కర్దాషియాన్, టామ్ బ్రాడీ, రాబ్ గ్రోంకోవ్స్కీ, క్వావో, డ్రూస్కీ, మేగాన్ థీ స్టాలియన్, ఎమిలీ రతాజ్‌కోవ్స్కీ, లిల్ వేన్ ఇతరులు హాజరయ్యారు. వారితో పాటే టోబీ, లిల్లీ కలిసి కనిపించారు. టోబీ, లిల్లీ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పటిదాకా టోబే ఈ వార్తలపై స్పందించలేదు. కానీ ఆయన మాజీ భార్యకు ఇదో తలనొప్పిగా మారింది. అందరూ ఆమెను దీని గురించి ప్రశ్నలు అడుగుతుండడంతో, జనాల నోళ్ళు మూయించేలా దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.

All About Tobey Maguire's 2 Kids, Ruby and Otis

- Advertisement -

తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన టోబే మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ ను ఓ నెటిజన్ మీ మాజీ భర్త మీ కుమార్తె కంటే మూడు సంవత్సరాలు పెద్ద మహిళతో ఎందుకు డేటింగ్ చేస్తున్నాడు? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను జెన్నిఫర్ ఆశ్చర్యకరంగా ఇగ్నోర్ చేయలేదు. ఆమె మాట్లాడుతూ ‘నేను సాధారణంగా ఇలాంటి అర్ధంలేని వాటికి స్పందించను. కానీ నిజం ఏమిటంటే అతను నా స్నేహితురాలికి తన కారు దగ్గరకు చేరుకోవడానికి ఒక మంచి వ్యక్తిగా సహాయం చేస్తున్నాడు. ఎలాంటి సంబంధం లేని విషయంలో అతనిపై డేటింగ్ రూమర్లు వచ్చాయి. మీ రూడ్ కామెంట్స్ కు ధన్యవాదాలు. ఈ రోజు మీకు మంచి అనుభూతిని కలిగించిందని నేను ఆశిస్తున్నాను’ అంటూ సెటైరికల్ గా సమాధానం ఇచ్చింది. ఇంకేముందు సదరు నెటిజన్ వెంటనే తన కామెంట్ ను డిలీట్ చేశాడు. కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది. అలాగే పార్టీలో

జెన్నిఫర్, టోబి దంపతులకు ఇద్దరు పిల్లలు

టోబి, జెన్నిఫర్ 2007లో హవాయిలోని కోనాలో వివాహం చేసుకున్నారు. వారు 2016లో విడిపోవడానికి ముందు తొమ్మిదేళ్ల పాటు కలిసే ఉన్నారు. 2020లో ఇద్దరి మధ్య వచ్చిన విబేధాల కారణంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మాజీ కపుల్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె రూబీ స్వీట్‌హార్ట్, కుమారుడు ఓటిస్ టోబియాస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు