Star Heroine: సినీ పెద్ద కు వ్య*భిచార గృహం.. రహస్యాలు బయటపెట్టిన హీరోయిన్..!

Star Heroine.. మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారంటూ జస్టిస్ హేమా (Justice hema)కమిటీ సమర్పించిన నివేదిక అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ నివేదిక భారతదేశ సినీ పరిశ్రమను ఒక్కసారిగా అలర్ట్ చేసిందని చెప్పవచ్చు. ఇన్ని రోజులూ లైంగిక వేధింపులు ఎదుర్కొని, సైలెంట్ గా ఉన్న చాలామంది నటీమణులు ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మీడియాతో చెప్పుకుంటున్నారు. హేమా నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేయగా.. మలయాళ సినిమా నేరస్తులచే నడపబడుతోందని, పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతోందని నివేదిక పేర్కొంది.

Star Heroine: Cine Pedda's brothel.. The heroine revealed the secrets..!
Star Heroine: Cine Pedda’s brothel.. The heroine revealed the secrets..!

మహిళలపై లైంగిక దాడులు..

ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యాను అంటూ హేమ తన నివేదికలో స్పష్టం చేసింది. మహిళలను కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా భయపెట్టేలా దాడులు ఉన్నాయని ఆమె తెలిపింది. ఇకపోతే జస్టిస్ హేమా కమిటీపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం సీనియర్ పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించగా, ఈ కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది మహిళ ఆర్టిస్టులు తమ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరిగా వెల్లడిస్తున్నారు.

మలయాళ ఇండస్ట్రీలోనే కాదు బెంగాళీ ఇండస్ట్రీలో కూడా..

ఈ క్రమంలోనే మలయాళ ప్రముఖ నటి రేవతి సంపత్ (Revathi sampath) ప్రముఖ నటుడు, నిర్మాత సిద్ధిఖీ (Siddhiqui )లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు చేసింది. అలాగే మరో నటి మినూ మున్నీర్(Minu munneer)కూడా తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలనే అంటూ బాంబు పేల్చింది. తన తోటి నటులైన ముఖేష్, ఇడవెల బాబు, జయ సూర్య, మణియం పిల్లరాజు శారీరకంగా తనను వేధించారంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు బెంగాళీ సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయంటూ అక్కడి స్టార్ హీరోయిన్ తెలపడం సంచలనంగా మారింది.

- Advertisement -

బెంగాలీ పరిశ్రమ వ్యభిచార గృహం లాంటిది..

ముఖ్యంగా బెంగాలీ పాపులర్ హీరోయిన్ రితాభరి చక్రవర్తి (Ritabari Chakraborty) బెంగాలీ సినీ పరిశ్రమలో పలువురు నటులు, నిర్మాతలు, దర్శకుల నుంచి మహిళా నటులకు వేధింపులు ఎక్కువవుతున్నాయని ఆమె తెలిపింది. ముఖ్యంగా బెంగాలీ పరిశ్రమ వ్యభిచార గృహం లాంటిది అని , ఇక్కడ ఒక పెద్ద ఉంటారు వారి చేతుల్లోనే బెంగాలీ పరిశ్రమ ఉంటుంది, అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే, ఇది ఒక బ్రోతల్ హౌస్ లాగా మారిపోయింది అంటూ సంచలన కామెంట్లు చేసింది.

ఇక్కడ కూడా ఏమా కమిటీ లాంటి సంస్థ ఏర్పాటు చేయాలి..

ముఖ్యంగా బెంగాలీ ఇండస్ట్రీలో కూడా హేమా కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఎన్నో కలలు కంటూ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ ఇది వ్యభిచార గృహం తప్ప మరొకటి కాదని నమ్ముతున్నారు. సీఎం మమతా బెనర్జీ కూడా దీనిపై హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేసి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆమె కోరింది. ఇకపోతే యావత్ భారత దేశ సినీ పరిశ్రమలో ఉండే నటీమణులు ఒక్కొక్కరిగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు