Star Heroine: పంతానికి పోతే కుటుంబ సభ్యులైనా చూడదు.. మరీ రాక్షసి రా బాబూ!

Star Heroine.. సాధారణంగా ఎక్కడైనా సరే కొంతమంది ఏదైనా విషయం జరిగితే దానిని చూసి చూడనట్టు వదిలేస్తారు.. కానీ మరి కొంతమంది దానిని అలాగే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ముఖ్యంగా పంతానికి పోతూ ఒక్కొక్కసారి తమను తాము విమర్శలకి కూడా గురి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఎంతలా అంటే ఏకంగా కన్నతల్లిదండ్రులను కూడా దూరం పెట్టే పరిస్థితికి చేరుకుంటారు. అయితే ఇక్కడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక బ్యూటీ కూడా అలాగే పంతానికి పోతుందట.. ఒక్కసారి పంతానికి పోయిందో ఎదుట ఉన్నది కన్న తండ్రి అయినా సరే వదిలిపెట్టదట. ఇక ఈమె గురించి తెలిసి అభిమానులు కూడా మరీ రాక్షసి రా బాబు ఇంత పంతం అయితే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Star Heroine: If you die, you won't even see your family members.
Star Heroine: If you die, you won’t even see your family members.

పంతానికి కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ డ్రీమ్ గర్ల్..

ఆమె ఎవరో కాదు టాలీవుడ్ ఒకప్పటి గ్లామర్ బ్యూటీ రంభ.. ఇటీవలే తనలోని వీక్నెస్ ను కూడా బయటపెట్టింది. తనను తిట్టిన తండ్రికి ఏకంగా ఆరు నెలలపాటు చుక్కలు చూపించానని అసలు విషయాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. గత రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ ను శాషించి.. కమర్షియల్ హీరోయిన్ గా పేరుపొందిన రంభ.. అందంతో మిస్మరైజ్ చేసి దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించి.. యువత డ్రీమ్ గర్ల్ గా పేరు దక్కించుకుంది. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ , మలయాళం, హిందీ , తమిళ్, భోజ్ పురి భాషల్లో కూడా తన అందచందాలతో ఆడి పాడింది.. అన్ని భాషల్లో సమాన జోరు దక్కించుకుంది.. ఏకకాలంలో నాలుగైదు భాషలలో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది కూడా.

ఒకప్పటి డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు ఫ్యామిలీకే అంకితం..

ముఖ్యంగా స్టార్ హీరోల రేంజ్ లో ఏడాదికి పది సినిమాల వరకు రిలీజ్ చేసి, అంతే పాపులారిటీ దక్కించుకుంది . దాదాపు పది సంవత్సరాలు పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె తర్వాత ఐటమ్ సాంగ్ చేసింది.. సీనియర్ హీరోలను మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ చేసి కుర్ర కారుకు చెమటలు పట్టించింది. క్రమంగా అవకాశాలు తగ్గేసరికి బొద్దుగా మారిన రంభ, వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇటీవల తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది.

- Advertisement -

నాన్న తిట్టారని ఆరు నెలలు మాట్లాడలేదు..

రంభ మాట్లాడుతూ.. నాకు ఒక వీక్నెస్ ఉంది.. దానివల్ల నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి.. నన్ను ఎవరైనా తిడితే తట్టుకోలేను. నా తప్పు లేకుండా ఎవరైనా తిడితే ఇక భరించలేను.. వారిపై కక్ష తీర్చుకోవాల్సిందే. రియలైజ్ అయ్యేంతవరకు వారిని టార్చర్ చేస్తూనే ఉంటాను.. ముఖ్యంగా నా తండ్రి విషయంలో కూడా ఇదే జరిగింది. ఏదో ఒక విషయానికి నన్ను మా నాన్న తిట్టారు.. దానికోసం ఏకంగా 6 నెలల పాటు మా నాన్నకు నరకం చూపించాను.. ఆయనతో మాట్లాడలేదు.. అది ఒక రకమైన టార్చర్.. నాన్న ను చాలా ఇబ్బంది పెట్టానని కూడా చెప్పుకొచ్చింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒకసారి మా నాన్న నన్ను తిట్టారు. ఉదయం షాప్ కి వెళ్లి నైట్ వచ్చేంతవరకు మెట్ల కింద వెళ్లి అలిగి కూర్చున్నారు. తిరిగి ఆయన వచ్చి సర్ధి చెప్పే వరకూ అలాగే ఉన్నాను.. ఆ తర్వాతే భోజనం చేశాను అంటూ తెలిపింది రంభ. మొత్తానికి అయితే తన పంతా గురించి తన వీక్నెస్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఏది ఏమైనా అమ్మాయిలలో ఇలాంటి క్యాటగిరీలు కూడా ఉంటారు అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు