Star Heroine: మోహన్ లాల్ పిరికోడు అంటున్న స్టార్ హీరోయిన్.. అసలు ఏమైందంటే..?

Star Heroine.. హేమా కమిటీ నివేదిక తర్వాత మలయాళ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని , అందులో పనిచేసే నటీమణులు మీడియాతో చెబుతూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందులో భాగంగానే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా పని ప్రదేశాలలో ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

Star Heroine: The star heroine who Mohanlal says is a coward.. What actually happened..?
Star Heroine: The star heroine who Mohanlal says is a coward.. What actually happened..?

ఇండస్ట్రీలో ఎక్కువ అవుతున్న లైంగిక ఆరోపణలు..

ఈ నేపథ్యంలోని ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాల గురించి బయట పెడుతున్నారు. ఇకపోతే మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక కలకలం రేపుతున్న నేపథ్యంలో భారతీయ సినిమా మొత్తం ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటోంది. చిత్రసీమలో పలువురు ప్రముఖ నటీమణులు దర్శకులపై లైంగిక ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మ అధ్యక్ష పదవికి నటుడు మోహన్ లాల్ (Mohan Lal)రాజీనామా చేశారు. అలాగే కార్యనిర్వాహక కమిటీ సభ్యులందరూ కూడా అమ్మకు రాజీనామా చేశారు. దీంతో హేమా కమిటీ విచారణ నివేదిక అందరిని విస్మయానికి గురి చేస్తే, మోహన్ లాల్ రాజీనామా అందరిని ఆశ్చర్యపరిచింది.

అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా..

ఇండస్ట్రీలో నిరంతర లైంగిక ఫిర్యాదుల నేపథ్యంలో మలయాళ నటీనటుల సంఘం అమ్మ నుంచి మోహన్ లాల్ తో సహా ఎగ్జిక్యూటివ్ లు రాజీనామా చేయడంతో ఇది పిరికిపందలు చేసే చర్య.. మోహన్ లాల్ ఒక పిరికివాడు అంటూ నటి పార్వతి (Actress Parvathi) విమర్శించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మోహన్ లాల్ అలాగే ఎగ్జిక్యూటివ్ లు రాజీనామా చేశారు అనే విషయాన్ని విని ఆశ్చర్యపోయాను. ఇది ఎంత పిరికితనం అంటే , ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా.. ఇలా పిరికితనంతో బాధ్యత నుంచి ఎలా తప్పుకుంటారు..? అంటూ ప్రశ్నించింది.

- Advertisement -

మోహన్ లాల్ ఒక పిరికివాడు..

అమ్మ లోని వ్యక్తులు ఎలా పనిచేస్తారో నాకు చాలా బాగా తెలుసు. అక్కడ మా అవసరాల గురించి మాట్లాడే హక్కు నాలాంటి వాళ్లకు లేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అంటే మెరుగైన నాయకత్వం అక్కడ అవసరం అవుతుంది. రాబోయే కాలంలోనైనా సరే ప్రతి ఒక్కరు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ హీరోయిన్ కోరింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అమ్మ అధ్యక్ష పదవికి మోహన్లాల్ రాజీనామా చేయడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మ సంఘంలో పనిచేసే సిద్ధిఖీ (Siddhiqui) పేరు ఈ ఆరోపణలలో ప్రధమంగా వినిపిస్తోంది. అతడి వల్లే చాలామంది హీరోయిన్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ చెప్పుకోచ్చారు. అవకాశాలు కావాలి అంటే పక్కలోకి రావాలని పిలుస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణల మధ్య అక్కడ ఉండలేక ఆయన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీలో వాళ్ళకి ఇబ్బందులు వస్తే నాయకుడు పరిష్కరించాల్సింది పోయి బాధ్యత నుంచి తప్పుకోవడం పిరికిపందతనం అంటూ హీరోయిన్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు