Stree 2: రిహార్సల్ వీడియో… హాట్ అందాలతో మతిపోగుడుతున్న తమన్నా..!

Stree 2.. మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగులో శ్రీ అనే సినిమా ద్వారా అడగపెట్టి, ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన తమన్నా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాకుండా డెవిల్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను భయపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే అందంతో యువతను ఆకట్టుకుంటూ తెగ సందడి చేస్తోంది.. ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఈమె అనుభవిస్తోంది అంటే.. సినీ ఇండస్ట్రీలో ఈమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Stree 2: Rehearsal video...Tamanna is crazy with hot beauty..!
Stree 2: Rehearsal video…Tamanna is crazy with hot beauty..!

స్త్రీ 2 నుంచీ తమన్నా సాంగ్ రిహార్సల్ వీడియో వైరల్..

రీసెంట్గా కేజిఎఫ్ , జైలర్ వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి అదరగొట్టేసింది.. తన డాన్స్ తో పాటు అందచందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా మరోసారి గ్లామర్ డోస్ పెంచేసి స్టెప్పులేసింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా స్త్రీ 2 లో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.. ఈ పాట సినిమాపై ప్రేక్షకులలో ఉన్న అంచనాలను మరింత పెంచేసిందని చెప్పవచ్చు. అయితే ఈ పాటకు సంబంధించి రిహార్సల్స్ వీడియో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న తమన్నా, ఈ పాట కోసం ఎంత కష్టపడిందో తెలియజేస్తూ రిహార్సల్ వీడియో షేర్ చేసింది చిత్ర బృందం. ఇందులో హాట్ గ్లామర్ షో చేస్తూ మరింత అందాలు వలకబోస్తూ యువతకు గిలిగింతలు పెడుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రిహార్సల్ కి సంబంధించిన వీడియో బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

ఆగస్ట్ 15 న థియేటర్లలోకి స్త్రీ 2.

స్త్రీ 2 చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. స్త్రీ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు స్త్రీ 2 సినిమాపై కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పవచ్చు.. అందుకు తగ్గట్టుగానే తమన్నా పాట కూడా అదరగొట్టింది.. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంది .ఇదిలా ఉండగా జైలర్ సినిమాలో తమన్నా చేసిన “కావాలయ్య” పాట భారీ పాపులారిటీ సంపాదించుకుంది.. ఆ సినిమా విజయానికి ఈ పాట కూడా తోడైంది.. ఇప్పుడు స్త్రీ2 సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే సినిమా విజయం కోసం తమన్నా ఏ రేంజ్ లో కష్టపడుతుందో మనకు ఈ రిహార్సల్ వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. మరి ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు