Stunt Master: ఇండియన్ సినిమాలో కాస్ట్ లీ స్టంట్ మాస్టర్ ఎవరో తెలుసా? ఒక్కో సినిమాకు కోట్లలో…

Stunt Master : సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది హీరో, డైరెక్టర్, హీరోయిన్. ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ పై కూడా దృష్టి పెడుతున్నారు. సినిమాకు కష్టపడే మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని చూపించరు. అలాంటి వాళ్ళలో స్టంట్ మాస్టర్ కూడా ఒకరు. సినిమాలలో హీరోలు చేసే యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆహా ఓహొ అని మురుస్తాం. కానీ ఆ స్టంట్స్ చేయించిన స్టంట్ మాస్టర్ ఎవరా? అని ఆలోచించేది అతి తక్కువ మంది మాత్రమే. మరి అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తున్న ఇండియన్ సినిమాలో అత్యధిక రెమ్యూనరేషన్ అంటుకుంటన్న స్టంట్ మాస్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న స్టంట్ మాస్టర్

సినిమా అనేది డైరెక్షన్, ప్రొడక్షన్, ఫైట్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వంటి 20కి పైగా విభాగాల కలయిక. అందుకే 24 క్రాఫ్ట్స్ అంటారు. ఆ విధంగా సినిమా తీయడానికి ఫిజికల్ గా, ఎకనామిక్ గా పని చేసే ఎన్నో డిపార్ట్ మెంట్ల మధ్య తమ జీవితాలను పణంగా పెట్టి పని చేసే డిపార్ట్ మెంట్ స్టంట్. టాలీవుడ్ లోనే కాదు ప్రపంచ స్థాయి సినిమాలో కూడా స్టంట్ పెర్ఫార్మర్స్ కే అత్యధిక రిస్క్ ఉంటుంది.

ఈరోజు మనం తెరపై చూసే యాక్షన్ విన్యాసాల వెనుక చాలా విషాదకరమైన కథలు ఉన్నాయి. చాలా మంది స్టంట్ నటులు షూటింగ్ సమయంలో మృత్యువును కూడా కౌగిలించుకుంటారంటే అతిశయోక్తి కాదు. స్టంట్ ఆర్టిస్టు అనేది అత్యంత ప్రమాదకరమైన జాబ్ లలో ఒకటి. ఆ విధంగా పీటర్ హెయిన్ అట్టడుగు స్థాయి నుంచి భారతీయ సినిమాలో గొప్ప స్టంట్ డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి. 50 ఏళ్లు నిండిన పీటర్ హెయిన్‌కు చిత్ర పరిశ్రమలో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం ఈయనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న స్టంట్ మాస్టర్.

- Advertisement -

Peter Hein turns director

పీటర్ హెయిన్‌ రెమ్యూనరేషన్

నటుడిగా నటిస్తూ పలు చిత్రాలకు స్టంట్ మాస్టర్ గా వ్యవరిస్తున్న పీటర్ ఒక్కో సినిమాకు రోజుకు మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఒక్కో సినిమాకు అత్యధికంగా రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే వారు తీసుకునే అనేక సాహసోపేత నిర్ణయాలకు ఇదేనా తగిన ప్రతిఫలం అంటే సమాధానం ప్రశ్నార్థకమే. ఒక స్టంట్ మ్యాన్ రోజుకు రూ.12,000 వరకు సంపాదిస్తాడు. అంతే కాకుండా వారు నటించే రిస్క్ సీన్లను బట్టి పారితోషికం కూడా తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది అనేది వాస్తవం.

పీటర్ హెయిన్ సినిమాలు

1973లో పుదుచ్చేరిలో జన్మించిన పీటర్ చాలా మంది స్టంట్ డైరెక్టర్స్‌తో కలిసి పని చేశారు. 2001లో విడుదలైన తమిళ చిత్రం “మిన్నలే”లో స్టంట్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేశాడు. ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు ఆయన ఫైట్ సీన్ ఫార్మాట్‌లో విడుదలవుతాయి. ఈ ఏడాది 2024లోనే ఆయన స్టంట్ సిస్టమ్‌లో తమిళం, మలయాళంలో ఆరు సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో ఇండియన్ 2, రాయన్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. బాహుబలి మూవీకి కూడా ఆయన వర్క్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు