Sudha Kongara: సూర్య ప్లేస్ లోకి శివ కార్తికేయన్, వర్కౌట్ అయితే మైల్ స్టోన్ ఫిలిం అవుతుంది

సూర్య పేరుకు తమిళ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగా ఇష్టమైన అభిమాన హీరో అని చెప్పొచ్చు. సూర్య తమిళ్లో చేసిన ఎన్నో సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతుంటాయి. అనువాదమైన సినిమాలకి చాలామంది తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సూర్య ని మన హీరో అనే విధంగా ఆదరించారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా కూడా సూర్యకి తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే గజినీ అని చెప్పొచ్చు.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాను అప్పట్లో తెలుగులో కూడా తీసి ఆలోచన చాలా మందికి వచ్చింది. ఈ సినిమా రీమేక్ నిమిత్తం పవన్ కళ్యాణ్ ను కూడా ఆ రోజుల్లో కలిసినట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో గజినీ సినిమాను తెలుగులోకి అనువాదం చేశారు.

అయితే సూర్య నటించిన సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడున్న చాలామంది తమిళ్ హీరోల కంటే సూర్య ముందు నుంచే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో సూర్య అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా అంటే ఆకాశం నీ హద్దురా అనే సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాను సుధా కొంగర తెరకెక్కించారు.

- Advertisement -

సుధా కొంగర గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తో గురు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించింది సుధా కొంగర. గురు సినిమా వెంకటేష్ కెరియర్ లో మంచి హిట్ అయింది. ఈ సినిమా కూడా రీమేక్, అయితే ఒరిజినల్ సినిమాని తెరకెక్కించింది మాత్రం సుధా కొంగర. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.

Suriya's Aakasame Nee Haddu Ra

 

ఇకపోతే ఆకాశం నీ హద్దుర సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సుధా కొంగర సూర్యతో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు ఇదివరకే కథనాలు కూడా వినిపించాయి. ఈ సినిమా గురించి రీసెంట్ టైమ్స్ లో ఎటువంటి అప్డేట్ లేదు అనుకుంటున్న తరుణంలో చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది.

ఈ సినిమా ఇంకొంచెం టైం పడుతుంది ఒక మంచి అవుట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామనేది అధికారిక ప్రకటన యొక్క సారాంశం. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నా యి. ఈ సినిమా సూర్య కాకుండా శివ కార్తికేయన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శివ కార్తికేయన్ కెరీర్ లో వస్తున్న 25వ సినిమా ఇది. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే శివ కార్తికేయన్ కెరీర్ కి ఒక మైల్ స్టోన్ ఫిలిం పడినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు