Sudheer Babu: ఆ స్టార్ హీరోతో నటించడం నా డ్రీమ్..!

Sudheer Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా.. దివంగత నటుడు కృష్ణ అల్లుడిగా సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ‘ఎస్ఎంఎస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం ‘సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. హార్రర్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను భారీగా మెప్పించింది. దీంతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయారు సుధీర్ బాబు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా అంతగా హిట్ అవలేదు.. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ‘ హరోం హరా ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘హరోం హర’ ప్రమోషన్స్ లో సుధీర్ బాబు..

చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఇందులో మాళవికా శర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ప్రముఖ సీనియర్ కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 31వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుధీర్ బాబు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.. ఇంటర్వ్యూలో భాగంగా మీ కెరియర్ లో అంచనాలు తప్పిన సినిమా ఏది అని ప్రశ్నించగా.. ప్రేమ కథా చిత్రం తప్ప.. తాను చేసిన అన్ని సినిమాల ఫలితాల విషయంలో తాను ఎంతగానో నిరుత్సాహపడినట్లు సుధీర్ బాబు తెలిపారు. నా చిత్రాలను ఎక్కువగా ప్రేక్షకులకు చేరువ చేయడంలోనే నేను ఫెయిల్ అయ్యానేమో అనిపించింది అంటూ తెలిపారు సుధీర్ బాబు.

డ్రీమ్ హీరో పై కామెంట్స్..

Sudheer Babu: My dream is to act with that star hero..!
Sudheer Babu: My dream is to act with that star hero..!

ఇకపోతే మీ డ్రీమ్ హీరో ఎవరు..? అని అడిగితే తన డ్రీమ్ హీరో మహేష్ బాబు అని చెప్పిన సుధీర్ బాబు.. మరి ఆయనతో మల్టీస్టారర్ మూవీ ఎప్పుడు చేస్తారు? అని అడగగా.. దానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు.. అయితే మల్టీ స్టారర్ గురించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు.. కానీ ఒకవేళ సాధ్యపడితే త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది అంటూ కూడా సుధీర్ బాబు తెలిపారు. ఇక ఈ విషయం చెప్పడంతో అభిమానులు అప్పుడే ఊహించేసుకుంటున్నారు.. సుధీర్ బాబు, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది అంటూ కూడా ఊహించేసుకుంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు అభిమానులు.. మొత్తానికైతే సుధీర్ బాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి..

- Advertisement -

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే..

ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి , మహేష్ బాబు భారీ స్థాయిలో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాకి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు