MaNanna Superhero : ప్రయోగాలు అచ్చిరావట్లేదని సేఫ్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడా?

MaNanna Superhero : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు (Sudheer babu) కూడా ఒకరు. మహేష్ బాబు బావమరిదిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా సక్సెస్ విషయానికి వస్తే.. చాలా తక్కువే అని చెప్పాలి. బిగినింగ్ డేస్ లో ప్రేమకథా చిత్రం, సమ్మోహనం సినిమాలతో మంచి సక్సెస్ ని అందుకోగా, హిందీలో భాగీ లో విలన్ గా నటించి అదరగొట్టాడు. అయితే సమ్మోహనం తర్వాత మళ్ళీ సక్సెస్ లైన్ సుధీర్ బాబు, ఓ నిఖార్సైన హిట్ కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ హంట్, మామా మశ్చింద్ర సినిమాలతో డిజాస్టర్స్ అందుకోగా, ఈ ఇయర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘హరోంహర’ సినిమా కూడా ప్లాప్ అయింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

Sudheer Babu Starrer MaNanna Superhero Movie Teaser Update

ఆకట్టుకుంటున్న మానాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్..

అయితే ఈ మధ్య చేసిన ప్రయోగాత్మక సినిమాలన్నీ బెడిసికొడుతున్నాయని, ఫస్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని, ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు సుధీర్. ప్రస్తుతం సుధీర్‌బాబు హీరోగా రూపొందుతోన్న ఎమోషనల్‌ డ్రామా “మా నాన్న సూపర్‌హీరో” (MaNanna Superhero). ఈ సినిమాను అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. వి సెల్యులాయిడ్స్‌, సీఏఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సునీల్‌ బలుసు ఈ సినిమాని నిర్మిస్తుండగా, రీసెంట్ గానే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క టీజర్ అప్డేట్ ని ఇస్తూ, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఆ పోస్టర్ లో సుధీర్ బాబు చేతక్ బైక్ పై కూరగాయల సంచి వేసుకుని వస్తున్నట్టు ఉంది. చూస్తుంటే సుధీర్ బాబు ఈసారి కథాబలం ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రానున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ప్రయోగాలు కలిసి రాలేదు.. అందుకే సేఫ్ గేమ్..

అయితే రీసెంట్ గా సుధీర్ బాబు చేసిన చిత్రాలన్నీ ప్రయోగాత్మక సినిమాలే. మామా మశ్చింద్ర, హరోం హర (Haromhara), హంట్ ఇలా అన్ని సినిమాలు బెడిసికొట్టాయి. అంతకు ముందు చేసిన కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా దెబ్బేసాయి. అందుకే ఈసారి ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రానున్నట్టు తెలుస్తుంది. ప్రయోగాల జోలికి ఈ సినిమాతో పక్కాగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఆర్ణ (Aarna) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్‌, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్‌, ఆమని, అన్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు