Sudheer Babu: సుధీర్ ‌బాబు హీరో అంటే సైడ్ అయిపోయిన ప్రొడ్యూసర్స్… మళ్లీ ఇప్పుడు వెంటపడ్డారు

Sudheer Babu: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా నిలబడడానికి అంటే ముందు డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నాడు సుదీర్ బాబు. తన ఫ్రెండ్స్ అయినటువంటి యూవి క్రియేషన్స్ వంశీ 70mm క్రియేషన్స్ విజయ్ కలిసి కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాలో సమంతకు అన్నయ్యగా నటించాడు. ఆ తర్వాత ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ కెరీర్ లో ప్రేమ కథ చిత్రం మంచి హిట్ గా నిలిచింది. ఆ క్రైమ్ కామెడీ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి హీరోగా సుధీర్ బాబును నిలబెట్టింది. అయితే ఈ ప్రాసెస్లో సుధీర్ బాబుకి చాలా ఫెయిల్యూర్ సినిమాలో వచ్చాయి. తరుణంలో సుధీర్ బాబుతో సినిమా చేయడానికి వచ్చిన చాలామంది ప్రొడ్యూసర్లు వెనక్కి వెళ్లిపోయారు. సుధీర్ బాబుకి మార్కెట్ లేదు అంటూ చాలామంది మాట్లాడుకునే వాళ్ళు.

Sudheer Babu

- Advertisement -

అప్పుడే సుధీర్ సినిమా చేయాల్సింది

ఇప్పుడు హరోం హర మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్లు ఇప్పటికే సుధీర్ బాబుతో సినిమా చేయాల్సింది. సమ్మోహనం మూవీ స్టోరీ ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్ల దగ్గరకే వచ్చింది. కానీ, ఈ ప్రొడ్యూసర్లకు తెలిసిన వాళ్లు.. హీరో గా సుధీర్ బాబు అయితే కష్టం. ఆయనకు మార్కెట్ లేదు. పెట్టిన బడ్జెట్ రాదు. లాస్ అవ్వడం పక్కా అని చెప్పారట.వారి మాటలు విని ఈ ప్రొడ్యూసర్లు సమ్మోహనం మూవీని వదులకున్నారట. మళ్లీ ఇప్పుడు హరోం హర మూవీ సినిమాతో సుధీర్ బాబుతో కలిసి చేస్తున్నారు.

సుధీర్ బాబు స్ట్రాంగ్ స్టేట్మెంట్

ఇదే టైంలో, ప్రొడ్యూసర్లకు సుధీర్ బాబు..
డబ్బులు నా పైన పెట్టకండి, సినిమాపై పెట్టండి, కథపై నమ్మకం ఉంటేనే డబ్బులు పెట్టండి. అప్పుడు సమ్మోహనం నా కంటే, కథ వల్ల హిట్ అయింది అని చెప్తాను అని అన్నారట. ఒక సినిమాకి సక్సెస్ వస్తే ఆ సినిమాలో నటులు మాట్లాడే తీరు ప్రవర్తించే తీరు మారిపోతూనే ఉంటుంది. కానీ సుదీర్ బాబు అలా కాకుండా ఒక హిట్టు పడినా కూడా ఆ సక్సెస్ కి కారణం సినిమా కథ అని బలంగా నమ్మి ఒక పదిమందికి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఇకపోతే సుదీర్ నటించిన హరోంహార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు