Sudheer Babu : స్పెషల్ డేని గుర్తు చేసుకున్న సుధీర్ బాబు..షేర్ చేసిన మెమొరీ ఏంటో తెలుసా!

Sudheer Babu : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకరు. ఎన్ని సినిమాలు చేసామన్న దానికంటే, ఎలాంటి సినిమాలు చేశామని ఆలోచిస్తారు సుధీర్ బాబు. అందుకే హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా విలక్షణమైన పాత్రలు చేస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా “హరోం హర” అనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక సుధీర్ బాబు స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి బావ అన్న సంగతి తెలిసిందే. ఆ బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ కి మొత్తం అయిదుగురు సంతానం. ఇద్దరు కొడుకులు రమేష్ బాబు మరియు మహేష్ బాబు అనే విషయం తెల్సిందే. ఇక కుమార్తెల విషయానికి వస్తే పెద్దమ్మాయి పద్మావతి, తర్వాత మంజుల, ఆ తర్వాత ప్రియదర్శిని. ఇక చిన్న కూతురు ప్రియదర్శిణి నే హీరో సుధీర్ బాబు (Sudheer Babu) పెళ్లి చేసుకున్నాడు. ఇక నేడు(మే 29) సుధీర్ బాబు, ప్రియదర్శినిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా సుధీర్ బాబు షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Sudhir Babu shares his memory with his wife on the occasion of their wedding anniversary

సుధీర్ బాబు షేర్ చేసిన హ్యాపీ మెమరీ..

అయితే సుధీర్ బాబు తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా ఓ బ్యూటీఫుల్ మెమరీ ని ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక అప్పట్లో కృష్ణ బిడ్డల గురించి అసలు బయటకు విషయాలు వచ్చేవి కాదు. వారి ఫోటోలు కూడా కనీసం బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు సోషల్‌ మీడియా పుణ్యమా అని కృష్ణ కూతురు ప్రియదర్శిణి యొక్క పెళ్లి కానప్పటి ఫోటో ఫస్ట్ టైం బయటకు వచ్చింది. అది కూడా ఆమె భర్త సుధీర్‌ బాబు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. పెళ్లి చూపుల సమయంలో నా వద్దకు వచ్చిన ఫోటో అన్నట్లుగా ప్రియదర్శిణి ఫోటోను సుధీర్ బాబు షేర్‌ చేశాడు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌, నువ్వు నా జీవితాన్ని సంపూర్ణం చేశావు, నా దగ్గర ఉన్న నీ మొదటి ఫోటో, పెళ్లి చూపుల ఫోటో అంటూ స్మైల్‌ ఈమోజీ ని షేర్‌ చేశాడు. సుధీర్ బాబు లోని రొమాంటిక్ యాంగిల్‌ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

- Advertisement -

వరుస సినిమాలతో బిజీ..

ఇక సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు ల ప్రోత్సాహం మరియు సహకారంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుధీర్ బాబు (Sudheer Babu) సొంత ఇమేజ్ ను దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం హరోం హర సినిమా విడుదలకు రెడీ చేస్తున్నాడు. బాలీవుడ్‌ లో కూడా భాగీ వంటి చిత్రాల్లో నటించి ఘనత దక్కించుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ మామా మషీన్ద్ర అంటూ ప్రయోగాత్మక సినిమాతో పలకరించగా, ఆ సినిమా ప్లాప్ అయింది. ఇప్పుడు జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో హారో హర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు