Suhas: పెద్ద బ్యానర్ ని పట్టేసిన సుహాస్.. ఆరోజే రిలీజ్..!

కలర్ ఫోటో సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు హిట్ -2 వంటి చిత్రాలలో విలన్ గా కూడా నటిస్తూ.. విభిన్నమైన పాత్రలతో అందరిని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారని చెప్పాలి. ఇకపోతే ఈ మధ్య కథలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సుహాస్ పెద్ద పెద్ద బ్యానర్లలో అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం గమనార్హం..

దిల్ రాజు బ్యానర్ లో సుహాస్..
గత ఏడాది బలగం వంటి నేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టేజియస్ బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తున్న ఈ నిర్మాణ సంస్థలో డిఫరెంట్ రోల్స్ తో మెప్పిస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరు దక్కించుకున్న సుహాస్ హీరోగా ఒక సినిమాని చేయబోతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ ఫోర్ గా గత ఏడాది డిసెంబర్లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవ్వగా.. ఇందులో సుహాస్ హీరోగా ఇతడికి జోడిగా సంకీర్తన విపిన్ హీరోయిన్గా ఎంపికైంది. నిర్మాత శిరీష్ సమర్పణలో హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు డైలాగ్ రైటర్ గా సలార్ చిత్రానికి పనిచేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం..

చిత్రంపై సుహాస్ క్లారిటీ..
తాజాగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించగా ఈ విషయంపై సుహాస్ మాట్లాడుతూ.. అందరూ మెచ్చే వినోదం ప్రారంభం అవుతుంది.. మీ క్యాలెండర్లో మే 24 ని గుర్తుపెట్టుకోండి.. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ లో నాలుగో చిత్రంలో నేను నటిస్తున్నాను ..మేమందరం అద్భుతమైన కామెడీతో వేడి పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాము.. నవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ సుహాస్ పేర్కొన్నారు.. ఇకపోతే మే 24వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా అందులో ఒక చిన్న పాప మహిళా న్యాయమూర్తిగా కనిపిస్తోంది.. చిన్నారి కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చేతిలో రెండు ట్రే స్కేల్ పట్టుకొని కనిపించింది.. మొత్తానికి అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఒక ఫన్నీ కోర్టు డ్రామా ఈ సినిమా అని అర్థమవుతుంది…

- Advertisement -

#JAGonMay 24 అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి బేబీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. సాయి శ్రీరామ్ సినిమా ఆటోగ్రఫీ అందిస్తున్నారు. ఇకపోతే బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో “ఆకాశం దాటి వస్తావా ” సినిమాని రూపొందిస్తున్నారు.. అలాగే ఈ బ్యానర్ లో ఆశీసష్ హీరోగా మూడో ప్రాజెక్టుని కూడా అనౌన్స్ చేయగా.. ఇప్పుడు నాలుగవ సినిమాగా సుహాస్ హీరోగా ఈ సినిమా రాబోతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సుహాస్ పెద్ద బ్యానర్ లోనే అవకాశాన్ని దక్కించుకున్నారు.. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన కెరియర్ స్టార్ పొజిషన్ కి చేరుకుంటుంది అనడంలో సందేహం లేదు..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు